Koratala Siva, Jr NTR: ఛాన్స్ తీసుకోవడానికి కొరటాల సిద్ధంగా లేరా?

ప్రతి స్టార్ డైరెక్టర్ స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ సినిమాలను మాత్రమే తెరకెక్కించాలని భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో వేర్వేరు కారణాల వల్ల బ్లాక్ బస్టర్ హిట్ కావాల్సిన సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంటూ ఉంటాయి. అలా కొరటాల శివ ఖాతాలో ఆచార్య సినిమాతో భారీ డిజాస్టర్ చేరింది. సున్నిత మనస్కుడైన కొరటాల శివ ఆచార్య సినిమా ఫలితం వల్ల తీవ్ర మనోవేదనకు గురయ్యారని సమాచారం. కొరటాల శివ తర్వాత సినిమా తారక్ హీరోగా తెరకెక్కనుంది.

కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో తనకు కాన్ఫిడెన్స్ ఉందని ఎన్టీఆర్ చెబుతున్నా కొరటాల శివ మాత్రం స్క్రిప్ట్ పై మళ్లీ రీ వర్క్ చేస్తానని చెప్పారని సమాచారం. రిస్క్ తీసుకోవడానికి కొరటాల శివ సిద్ధంగా లేరని ఒక్క సీన్ నచ్చకపోయినా ఆ సీన్ పై కొరటాల శివ రీ వర్క్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. జూన్ లోనే ఈ సినిమా మొదలు కావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమా జులై సెకండ్ వీక్ కు పోస్ట్ పోన్ అయింది.

కొరటాల శివకు తారక్ నుంచి అవసరమైన మద్దతు లభిస్తోందని బోగట్టా. ఎన్టీఆర్ కు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చేలా కొరటాల శివ వర్క్ చేస్తున్నారని పాన్ ఇండియా సినిమాగానే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. ఆచార్య సినిమా ద్వారా నష్టపోయిన బయ్యర్లకు కొరటాల శివ ఇప్పటికే సెటిల్ చేశారని తెలుస్తోంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.

తారక్ కు జోడీగా నటించే అవకాశాన్ని అందుకున్న హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు ఈ నెల 20వ తేదీన క్లారిటీ రానుంది. మే 20వ తేదీన ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. కొరటాల శివ తర్వాత సినిమాలతో కూడా విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus