తెలుగులో వందల సంఖ్యలో విలక్షమైన పాత్రలు చేసి నటుడిగా కోట శ్రీనివాసరావు గుర్తింపును సొంతం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచే నాటకాలు అంటే విపరీతమైన ఆసక్తి ఉన్న కోట శ్రీనివాసరావు సినిమాల్లోకి రాకముందు ఎస్బీఐలో పని చేశారు. తాజాగా కోట శ్రీనివాసరావు సినిమా వాళ్ల పిల్లలంటే ఎలాగెలాగో ఉంటారని అనుకుంటారని చెప్పుకొచ్చారు. అయితే తన పిల్లలు మాత్రం బుద్ధిమంతులు అని కోట శ్రీనివాసరావు అన్నారు. తాను ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో షూటింగ్ లలో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయని పిల్లలు తనను అర్థం చేసుకున్నారని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.
తన కొడుకు ఇల్లు ఎలా ఉండాలో షీల్డ్ లు ఎక్కడ ఉండాలో డిజైన్ చేయించారని కొడుకు మరణం గురించి చెబుతూ భగవంతుడి లీలలు అర్థం కావని కోట శ్రీనివాసరావు తెలిపారు. కోడలు దుఃఖాన్ని కడుపులోనే దాచుకుందని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు. ఆ కడుపుకోతను ఎలా తట్టుకున్నానో అంటూ కొడుకు మరణం గురించి కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు. దేవుడు తనకు మామూలు పరీక్షలు పెట్టలేదని చెట్టంత కొడుకు పోతే మనిషి అనేవాడు ఎలా తట్టుకోగలడని కోట శ్రీనివాసరావు అన్నారు.
ఓదార్చే శక్తి సారీ అనే పదానికి ఉండదని కోట శ్రీనివాసరావు వెల్లడించారు. 2010 సంవత్సరంలో రోడ్ యాక్సిడెంట్ లో కోట శ్రీనివాసరావు కొడుకు మృతి చెందారు. కోట శ్రీనివాసరావు కొడుకు బైక్ కు హఠాత్తుగా బ్రేక్ వేయడంతో బైక్ డీసీఎం వ్యానును ఢీ కొట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.