పవన్ సినిమాలో కోటాశ్రీనివాసరావు!
- March 8, 2021 / 12:48 PM ISTByFilmy Focus
తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న గొప్ప నటుల్లో కోటా శ్రీనివాసరావు ఒకరు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే ఈ నటుడు మూడు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించారు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకప్పటితో పోలిస్తే ఆయనకి ఓపిక బాగా తగ్గింది. వయసు పెరగడంతో హుషారుగా కనిపించడం లేదు. దీంతో ఫిలిమ్ మేకర్స్ కూడా ఆయన్ని సినిమాలో తీసుకోవడం తగ్గించేశారు. ఇటీవల విడుదలైన ‘పవర్ ప్లే’ సినిమాలో కోటా కనిపించారు కానీ నటించడానికి బాగా ఇబ్బందిపడ్డారని అనిపించింది.
ఈ కారణంతోనే దర్శకనిర్మాతలు ఆయన్ని దూరం పెట్టి ఉండొచ్చని అంటున్నారు. అయితే అవకాశాల కోసం తనే స్వయంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, వి.వి.వినాయక్ లకు ఫోన్ చేసిన విషయాన్ని కోటా తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నో ఏళ్ల పాటు గ్యాప్ లేకుండా సినిమాలు చేసిన తాను.. లాక్ డౌన్ సమయంలో పూర్తిగా సినిమాలకు దూరమై ఇంట్లో ఉండిపోయానని.. ఆ సమయంలో తనకు చాలా బోర్ కొట్టిందని కోటా చెప్పారు.

ఆ విరామం తరువాత తాను సినిమా అవకాశాల కోసం చిరంజీవి, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు ఫోన్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమాలో తానొక కీలకపాత్ర చేస్తున్నట్లు కోటా వెల్లడించారు. చాలా కాలం తరువాత పవన్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉందని.. తన పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు.
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

















