Kota Srinivasa Rao, Anasuya: అనసూయపై కోటా శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు!

ఈ మధ్యకాలంలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు పేరు వార్తల్లో బాగా నానుతోంది. ఇటీవల జరిగిన ‘మా’ ఎలెక్షన్స్ లో విష్ణుకి సపోర్ట్ చేయమని మీడియా ముందుకొచ్చి చెప్పారు. ఈ క్రమంలో నాగబాబు.. కోటాపై మండిపడుతూ దారుణమైన కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా కోటా శ్రీనివాసరావు ప్రముఖ యాంకర్ అనసూయపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. బుల్లితెరపై అనసూయకి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. తన గ్లామర్ షోతో అందరినీ ఆకట్టుకుంటూ..

ఓ పక్క టీవీ షోలు, మరోపక్క సినిమాలు అంటూ తెగ బిజీగా గడుపుతోంది. అయితే ఆమె డ్రెస్సింగ్ పై మాత్రం ఓ వర్గం ప్రేక్షకుల నుంచి ఇప్పటికీ విమర్శలు వస్తూనే ఉంటాయి. ఇద్దరు పిల్లల తల్లి అయి ఉండి ఆ బట్టలేంటి అంటూ నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తుంటారు. తాజాగా అనసూయ డ్రెస్సింగ్ పై సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కూడా వివాదాస్పద కామెంట్స్ చేశారు. అనసూయ మంచి డాన్సర్ అలానే మంచి నటి అని చెప్పిన ఆయన.. ఆమె వేసుకునే బట్టలు మాత్రం తనకు నచ్చవని కామెంట్ చేశారు.

ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అనసూయ లాంటి అందమైన అమ్మాయి ఎలా ఉన్నా.. జనాలు చూస్తారని.. అలాంటి బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఆమె చక్కటి నటి అని.. కానీ ఆమె డ్రెస్సింగ్ మాత్రం నచ్చదని అన్నారు. ఆమె మీద గౌరవం ఉంది కాబట్టే డ్రెస్సింగ్ మారిస్తే బావుంటుందని చెబుతున్నట్లు వెల్లడించారు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus