Kota Srinivasa Rao: రోజుకు రెండు కోట్లు సంపాదిస్తున్నామని బహిరంగంగా చెబుతున్నారు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాలలో నటిస్తూ తన విలనిజంతో అందరిని భయపెట్టినటువంటి వారిలో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఒకరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇలా నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోటా శ్రీనివాసరావు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం మనకు తెలిసిందే. వయసు పై పడటంతో ఈయనకు సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి.

ఇలా కోటా శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) ఒక సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో ఈయన కేవలం ఇంటికి మాత్రమే పరిమితమై పలు యూట్యూబ్ ఛానల్ లకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.ఈ సందర్భంగా కోటా శ్రీనివాసరావు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా కోట మాట్లాడుతూ ఒకానొక సమయంలో స్టార్ హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ ఏఎన్నార్ కృష్ణ శోభన్ బాబు వంటి వారందరూ కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకున్న ఎవరూ కూడా ఎప్పుడు తమ రెమ్యూనరేషన్ ఇంత అని బయటకు చెప్పిన సందర్భాలు లేవు. కానీ ప్రస్తుతం హీరోలు మేము రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నామని బహిరంగంగా చెబుతున్నారని తెలిపారు. ఇక ప్రస్తుత కాలంలో వచ్చే సినిమాలు సినిమాగా లేవని ఒక సర్కస్ లాగా ఉంటున్నాయని తెలిపారు.. సినిమాలో ఏదైనా విషాదగీతం వస్తే దానికి కూడా డాన్సులు వేస్తున్నారని తెలిపారు.

ఇలా స్టార్ హీరోలు భారీగా రెమ్యూనరేషన్ తీసుకోవడమే కాకుండా మరోవైపు వాణిజ్య ప్రకటనల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నారని తెలిపారు. భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ హీరోలు ఏ దానిని వదిలిపెట్టడం లేదని బాత్రూం బ్రష్ ల నుంచి మొదలుకొని బంగారం వరకు ప్రతి ఒక్కటిని ప్రచారం చేస్తూ భారీగా సంపాదిస్తున్నారని ఇలా అన్ని అవకాశాలు వీరికే వస్తే మిగిలిన వారు ఎలా సంపాదించుకుంటారు అంటూ ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus