దిల్‌ రాజు గురించి డిస్ట్రిబ్యూటర్ల మాటామాట

ఇండస్ట్రీలో దిల్‌ రాజును ఎవరన్నా ఏమన్నా అంటే పెద్దగా స్పందించేవారు ఉండరు. ఆ మాటకొస్తే పెద్ద నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎప్పుడూ తమ మీద వచ్చే మాటల విషయంలో అలానే ఉంటారు. కానీ వారి అనుచరులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రం వాటిపై అన్యాపదేశంగా స్పందిస్తూ ఉంటారు. తాజాగా మరోసారి అదే జరిగింది. ‘క్రాక్‌’ సినిమా విషయంలో ఓ డిస్ట్రిబ్యూటర్‌.. దిల్ రాజు మీద తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని సాక్ష్యాధారాలు కూడా చూపించాడు.. వినిపించాడు. దానిపై ఎప్పటిలాగే దిల్‌ రాజు నుంచి ఎలాంటి స్పందన లేదు. కానీ ఒక వ్యక్తి దానిపై స్పందించాడు. ఆయన దిల్‌ రాజు సన్నిహితుడు కావడం విశేషం.

ఇటీవల ‘క్రాక్‌’ నైజాం ఏరియా డిస్ట్రిబ్యూటర్‌ వరంగల్‌ శ్రీను మాట్లాడుతూ థియేటర్ల విషయంలో దిల్‌ రాజు నియంతలా వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. క్రాక్ సినిమా బాగా ఆడుతున్నా సగం థియేటర్ల నుండి తీసేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో ‘మాస్టర్‌’ను తెలుగులోకి తీసుకొచ్చిన మహేష్‌ కోనేరు స్పందించారు. ‘‘మాస్టర్‌’ మొదటి రోజు మొదటి రోజు 150 థియేటర్లలో ఆడింది. తర్వాత రోజున సినిమాలు విడుదల ఉండటం వల్ల 80 థియేటర్లకు తగ్గించాం. సినిమా బాగా ఆడుతున్నా థియేటర్లు తగ్గించారు అంటే సరి కాదు. పండుగకు మన సినిమానే కాకుండా ఇతర సినిమాలూ విడుదల అవుతున్నాయి. దీంతో అందరూ స్క్రీన్‌ లు షేర్‌ చేసుకోవాలి. అందుకే థియేటర్లు తగ్గించాల్సి ఉంటుంది. అన్ని సినిమాలకు మంచి వసూళ్లు రావాలి’’ కదా అని అన్నారు మహేష్‌ కోనేరు. మహేష్‌ కోనేరు నేరుగా వరంగల్‌ శ్రీను పేరు చెప్పకపోయినా… సమాధానం ఆయనకే అని తెలిసిపోతోంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల గొడవ ఎప్పుడూ ఉండేదే. ప్రతి సీజన్‌కు ఎక్కువ సినిమాలు రావడం…. ఒకటో, రెండో సినిమాలకు థియేటర్లు దొరక్కపోవడం సాధారణమైపోయింది. అయతే థియేటర్లు దొరకవు అని తెలిసినా కావాలనే ఇలా చేస్తున్నారనే కామెంట్స్‌ కూడా వినిపిస్తుంటాయి. అయినా బాగా ఆడే సినిమాను తీసేసి.. ఆడని సినిమా ఎవరు ఉంచుకుంటారు. అందుకే ఆడని సినిమాల థియేటర్లలో మళ్లీ క్రాక్‌ వేసేస్తున్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus