వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ టాక్‌ రిలీఫ్‌ ఇది

తొలి సినిమా విడుదల కాకుండానే రెండో సినిమా మొదలుపెట్టే డెబ్యూ హీరోలు టాలీవుడ్‌లో చాలా తక్కువ. అయితే మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో ఇది కనిపిస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే మెగా మేనలుళ్లకు ఇది సాధ్యమవుతోంది. సాయిధరమ్‌ తేజ్‌ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ చేస్తే, తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ క్రిష్ సినిమా చేసేశాడు. ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా క్రిష్‌ సొంత బ్యానర్‌లో తెరకెక్కించాడు. సినిమా చిత్రీకరణ పూర్తయిపోయిందని కూడా తెలుస్తోంది.

ఈ సినిమా విడుదల విషయంలో క్రిష్‌ టీమ్‌ ఇన్ని రోజులు తర్జనభర్జనలు పడుతూ వచ్చింది. కరోనా- లాక్‌డౌన్‌ టైమ్‌లో ఓటీటీలో సినిమా విడుదల చేసేద్దాం అనే ఆలోచన కూడా చేశారనే వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత అలాంటి మాటలు వినిపించలేదు. ‘ఉప్పెన’ ఫలితం బట్టి నిర్ణయం తీసుకుందామని క్రిష్‌ అనుకున్నారని తెలిసింది. అయితే ఇప్పుడు చాలా ఖుషీగా ఉన్నారట. ‘ఉప్పెన’కు ఊహించని విజయం రావడం, మంచి వసూళ్లు వస్తుండటమే దీనికి కారణం.

ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ మంచి వసూళ్లే దక్కుతున్నాయి. దీంతో క్రిష్‌ తన సినిమాను థియేటర్లలోనే విడుదల చేసేందుకు ఓకే అనుకుంటున్నారట. అంతే కాదు వీలైనంత త్వరగా ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారట. ఈ సినిమాకు ‘కొండపొలం’ అనే పేరు రిజిస్టర్‌ చేయించినట్లు వార్తలొచ్చాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. ఇందులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తోంది. ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని ఫొటోలు ఆ మధ్య సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus