తొలి చిత్రం గమ్యం తోనే సినీ విశ్లేషకుల అభినందనలు అందుకున్న క్రిష్.. కంచె తో జాతీయ గుర్తింపు సాధించారు. అతని దర్శకత్వంలో లేటెస్ట్ గా వచ్చిన గౌతమి పుత్ర శాతకర్ణి సూపర్ హిట్ అయింది. తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి పరిచయం చేసిన డైరక్టర్ గా పేరు దక్కించుకున్నారు. దీని తర్వాత ఆయనకు అనేక భారీ ప్రాజక్టులు వచ్చాయి. అందులో తనకి నచ్చిన వాటిని తెర రూపం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అంతేకాదు భారీ సినిమాల రూపకల్పనలో భాగం పంచుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 తర్వాత ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి సినిమాను చేయనున్నారు. స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ మాటలు అందిస్తున్నారు.
ఈ హిస్టారికల్ మూవీ సెట్స్ మీదకు వెళ్లే ముందు క్రిష్ సలహాలను చిత్ర బృందం తీసుకుంటోంది. గౌతమి పుత్ర శాతకర్ణి వంటి ఒకటవ శతాబ్దపు కథను మలిచిన అతని సలహాలు సినిమాకు ఉపయోగపడుతాయని చిరు అభిప్రాయం. అందుకే ఉయ్యాలవాడ స్క్రిప్ట్ క్రిష్ వద్ద ఉందని సమాచారం. అలాగే బాలీవుడ్ లో కంగనా రనౌత్ ఝాన్సీ లక్ష్మి భాయ్ కథని విజయేంద్ర ప్రసాద్ తో స్క్రిప్ట్ గా రాయిస్తోంది. ఇది కూడా హిస్టారికల్ మూవీ కావడంతో దీనిని క్రిష్ అయితే బాగా తెరకెక్కిస్తారని విజయేంద్ర ప్రసాద్ కంగనాకు చెప్పారంట. అందుకు ఆమె క్రిష్ ని డైరక్ట్ గా పెట్టుకోవాలని భావిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా సొంత సినిమా కథలతో పాటు ఇతర కథలకు క్రిష్ మెరుగులు దిద్దుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.