బోయపాటి శ్రీను బాటలో కృష్ణవంశీ..!!

క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీని గత కొంతకాలంగా విజయాలు పలకరించడం లేదు. 2007లో వచ్చిన చందమామ సినిమా తర్వాత చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను బాటలో వెళుతున్నారు. లెజెండ్, సరైనోడు చిత్రాల్లో జగపతిబాబు, ఆదిలను విలన్ గా పరిచయం చేసి బోయపాటి శ్రీను బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. సినిమా నిండా స్టార్స్ ను నింపి విజయాలను సొంతం చేసుకున్నాడు.

అదేవిధంగా కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం చిత్రంలో ఎక్కువ స్టార్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సందీప్ కిషన్, రెజీనా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో కాజల్ గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనుంది. అంతేకాకుండా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పోలీస్ ఆఫీసర్ గా పవర్ ఫుల్ యాక్షన్ చేయనున్నాడు. ఇప్పుడు ఈ చిత్రానికి మరో హీరో కలిసాడు. దేవుళ్లు, మన్మధుడు సినిమాల్లో బాలనటుడిగా నటించి… ఆ తరువాత ‘నచ్చావులే’ సినిమాతో హీరోగా పరిచయం అయినా తనీష్ విలన్ గా కనిపించనున్నాడు.

అతను హీరోగా నటించిన  రైడ్, మౌనరాగం, ఏం పిల్లో ఏం పిల్లాడో, కోడిపుంజు, మంచివాడు, మేం వయసుకు వచ్చాం, తెలుగబ్బాయి, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాలు ఆశించినంత  విజయాన్ని అందుకోలేక పోయాయి. హిట్ కోసం కొత్త బాటలో పయనిస్తున్న కృష్ణవంశీ, తనీష్ లకు ఈ చిత్రం ఎంతవరకు హెల్ప్ అవుతుందో వేచి చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus