Krishna Vamsi: కృష్ణ వంశీ కొత్త సినిమా ఇదేనట… అవన్నీ వదిలేసినట్లేనా?

తారక్‌ సినిమాల్లో సరైన విజయం అందుకోక పోయినా నటుడిగా ఓ మెట్టు ఎక్కించిన సినిమా ‘రాఖీ’. కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి స్పందనే వచ్చింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యను ఆ సినిమాలో ప్రస్తావించారు. ఆ సినిమా థియేటర్లలో బాగా ఆడకపోయినా… ఇప్పటికీ ఆ సినిమాలో తారక్‌ నటనను, చూపించిన విధానాన్ని ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి సినిమానే మరోసారి తెరకెక్కిస్తా అంటున్నారు కృష్ణవంశీ.

‘రాఖీ’ సినిమాను ప్రస్తావిస్తూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కృష్ణవంశీ సమాధానం ఇచ్చారు. ‘రాఖీ’ లాంటి సినిమా మళ్లీ జూనియర్ ఎన్టీఆర్‌తో ఉంటుందా? అని ఆ నెటిజన్‌ అడిగితే… ‘ఎన్టీఆర్ ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్. ఆయనతో అలాంటి సినిమా ఇప్పుడు కాదు కానీ ఆ తరహాలోనే మరో సినిమా ప్లాన్ చేస్తున్నాను’ అని చెప్పారు. అయితే ఆ సినిమా హీరోయిన్ ఓరియెంటెడ్‌గా ఉంటుందని చెప్పారు. అంతేకాదు సమాజంలోని డిఫరెంట్ ప్రాబ్లమ్.. డిఫరెంట్ కాన్సెప్ట్‌ను కొత్త ‘రాఖీ’లో చూపిస్తాం అని చెప్పారు.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌ చర్చల దశలో ఉందని, అన్నీ ఓకే అయితే త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని అంటున్నారు. ఇందులో హీరోయిన్ల కోసం స్టార్‌ హీరోయిన్లనే తీసుకుంటారు అని కూడా అంటున్నారు. దీంతో క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ నుండి మరో మంచి మెసేజ్ రానుంది అని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు. అయితే ఇక్కడే ఓ సమస్య వచ్చింది. ఆయన నుండి సినిమాలు అనౌన్స్‌ అవుతున్నాయి కానీ అవి పట్టాలెక్కడం లేదు. ఒకవేళ పట్టాలెక్కినా ముందకెళ్లడం లేదు.

రీసెంట్‌గా ‘రంగ మార్తాండ’ సినిమాతో థియేటర్లలోకి వచ్చి మెప్పించారు (Krishna Vamsi) కృష్ణవంశీ. ఆ తర్వాత ‘అన్నం’ అనే ఓ సినిమా అనౌన్స్‌ చేశారు. పెద్ద హీరోతోనే ఆ సినిమా ఉంటుంది అని కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్‌ లేదు. ఇప్పుడు ‘రాఖీ’ లాంటి సినిమా అంటున్నారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus