Krishnam Raju, Prabhas: ప్రభాస్ పిల్లలతో నటించాలని ఉంది: కృష్ణంరాజు

టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన యంగ్ రెబల్ స్టార్ మెల్ల మెల్లగా తన స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా పెంచుకుంటూ ఉండడం విశేషం. బాహుబలి సినిమా ప్రభాస్ ను అమాంతంగా నెంబర్ వన్ స్టార్ గా మార్చేసింది. అతడి నుంచి రాబోయే ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉంది. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు ప్రభాస్ ఒంటి చేతితోనే బ్రేక్ చేస్తాడు అని చెప్పవచ్చు.

Click Here To Watch Now

ప్రభాస్ తో సినిమాలు చేయాలి అని ప్రస్తుతం దేశం లో ఉన్న చాలా మంది స్టార్ దర్శకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ ఎదుగుదలను చూసిన కృష్ణంరాజు అయితే ఎంతగానో సంతోషిస్తున్నాడు అని అర్థమవుతోంది. ప్రభాస్ ఎంత స్టార్ హీరోగా ఎదిగినప్పటికి కూడా తన పెద నాన్న దగ్గర మాత్రం ఇంకా అదే భయం భక్తితో ఉన్నాడు అని చాలా సమయాల్లో రుజువైంది. పెదనాన్న అంటే ప్రభాస్ కు చాలా ఇష్టం.

ఇక రాధే శ్యామ్ సినిమా విషయంలో కూడా కృష్ణంరాజు చాలా సంతోషంగా ఫీల్ అయినట్టు గా తెలుస్తుంది. ఈ సినిమాకు వచ్చిన టాక్ తో కుటుంబ సభ్యులు కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన కృష్ణంరాజు రాధే శ్యామ్ సినిమా మంచి విజయాన్ని అందుకోవడం ఎంతగానో సంతోషాన్నిచ్చింది అని అన్నారు. అంతేకాకుండా ప్రభాస్ తో నటించడం కూడా ఎంతో హ్యాపీగా ఉంది అని ప్రభాస్ తొందరగా పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రేమగా ఉంది అని కృష్ణంరాజు అన్నారు.

ఇక ప్రభాస్ పిల్లలతో కూడా నటిస్తాను అని చెప్పడం విశేషం. ప్రభాస్ కూతురితో లేదా కొడుకు తో నటించాలని ఎంతో ఆసక్తిగా ఉంది అని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్ వయస్సు 42 సంవత్సరాలు. అతని పెళ్లి గురించి గత కొన్నేళ్లుగా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ప్రభాస్ మాత్రం సోలోగానే ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. మరి పెదనాన్న కృష్ణం రాజు కోరుకుంటున్నట్లుగా ప్రభాస్ తొందరగా పెళ్లి చేసుకుంటాడో లేదో చూడాలి.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus