Krishnam Raju, Prabhas: ప్రభాస్‌ సినిమాల గురించి కృష్ణంరాజు ఏమన్నారంటే?

వెండితెరపై రెబలిజం చూపించాలంటే ఆ రోజుల్లో కృష్ణంరాజు, ఈ రోజుల్లో ప్రభాస్‌ రాజు.. అదేనండి మన డార్లింగ్‌ ప్రభాస్‌. ఆ ఆరడుగులపైబడిన కటౌట్లను వెండితెరపై చూస్తే అభిమానులు పూనకాలతో ఊగిపోతారు. అలాంటి ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ అనే ప్రేమకథతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు. తన పెదనాన్న కృష్ణంరాజుకు చెందిన గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌తో కలసి యూవీ క్రియేషన్స్‌ ఆ సినిమాను నిర్మించారు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు ప్రత్యేక వీడియోలో తన అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నారు.

Click Here To Watch Now

‘రాధేశ్యామ్‌’కి వస్తున్న ఆదరణ పట్ల కృష్ణంరాజు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు వచ్చే సంవత్సరం నుండి ప్రభాస్‌ ఏడాదికి రెండు సినిమాలు చేస్తాడని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ‘రాధేశ్యామ్’ సినిమా ‘బాహుబలి’తో పోల్చి చూడొద్దని కూడా కోరారు కృష్ణంరాజు. ఇక ప్రభాస్‌ సినిమాల్లో తనకు ‘వర్షం’ సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పారు. అలాగే తను నటించిన ‘మనవూరి పాండవులు’లాంటి చిత్రాన్ని ప్రభాస్ చేస్తే చూడాలని ఉందని చెప్పారు సీనియర్‌ రెబల్‌ స్టార్‌.

ప్రభాస్‌తో కలసి గతంలో ‘బిల్లా’లో నటించిన కృష్ణంరాజు.. ప్పుడు ‘రాధేశ్యామ్‌’లో కూడా చిన్న పాత్ర పోషించారు. ప్రభాస్‌తో కలసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పారు కృష్ణంరాజు. ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకుని పిల్లలను కంటే నాకు ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆ పిల్లలను నా చేతిలో ఆడించాలని ఉంది అని కూడా చెప్పారు సీనియర్ రెబల్‌. తాను మాస్‌ హీరోగా ఫుల్‌ పీక్స్‌లో ఉన్నప్పుడు ప్రేమ కథలు చేశానని, ఇప్పుడు ప్రభాస్‌ కూడా మాస్‌ హీరోగా, పాన్‌ ఇండియా హీరోగా పీక్స్‌లో ఉన్నప్పుడు ఇలాంటి సినిమా చేయడం నటుడిగా తన ఆలోచనల్ని చూపిస్తున్నాయన్నారు కృష్ణంరాజు.

ప్రభాస్‌ పాన్‌ ఇండియా హీరోగా వరుస సినిమాలు చేయడం, ఆనందంగా ఉందని, ఈ స్థాయిని ఇంకా పెంచుకుని మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలని కోరారాయన. ఇక ఈ సినిమా ఇటీవల విడుదలైన మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. పూర్తి ఫలితం త్వరలో తేలుతుంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus