Krishnamma Collections: ‘కృష్ణమ్మ’ 5 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

సత్యదేవ్ (Satyadev)  హీరోగా కొరటాల శివ (Koratala Siva) సమర్పణలో ‘కృష్ణమ్మ’ (Krishnamma) అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ళ క్రితం అంటే 2007 లో ఆయేషా అనే ఓ మైనర్ బాలిక హత్య ఉదంతం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. మే 10 న రిలీజ్ అయిన ఈ సినిమా యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద అంతంత మాత్రమే పెర్ఫార్మ్ చేస్తుంది.

వీక్ డేస్ లో అయితే ఇంకా డౌన్ అయ్యింది ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.26 cr
సీడెడ్ 0.11 cr
ఉత్తరాంధ్ర  0.17 cr
ఈస్ట్ 0.05 cr
వెస్ట్ 0.02 cr
గుంటూరు 0.04 cr
కృష్ణా 0.11 cr
నెల్లూరు 0.03 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.79 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.05 cr
 ఓవర్సీస్ 0.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.92 cr (షేర్)

‘కృష్ణమ్మ’ రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. 5 రోజులు పూర్తయ్యేసరికి కేవలం రూ.0.92 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.2.58(కరెక్టెడ్) కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.వీక్ డేస్ లో ఈ మూవీ ఆశించిన స్థాయిలో రాబట్టడం లేదు. మరి ఫైనల్ గా ఎంత వరకు రాబడుతుందో చూడాలి.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus