Krithi Shetty: సూర్య సినిమాకు కృతి అన్ని రూ.కోట్లు తీసుకున్నారా?

  • March 31, 2022 / 04:08 PM IST

తెలుగులో ప్రస్తుతం ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోయిన్లలో కృతిశెట్టి ఒకరు. సూర్య హీరోగా బాల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాతో కృతిశెట్టి కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సాధారణంగా యంగ్ హీరోయిన్లు స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ ఆఫర్ వస్తే రెమ్యునరేషన్ ను పెద్దగా పట్టించుకోరు. అయితే సూర్య సినిమా కోసం కృతిశెట్టి మాత్రం భారీగానే డిమాండ్ చేశారని సమాచారం. 18 సంవత్సరాల తర్వాత సూర్య, బాల కాంబినేషన్ లో సినిమా కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

Click Here To Watch NOW

సూర్య మూవీ కొరకు కృతిశెట్టి కోటీ 50 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా మేకర్స్ అంగీకరించి కృతినే ఈ సినిమాలో ఫైనల్ చేశారు. కృతిశెట్టి నటిస్తే తెలుగులో కూడా సినిమాకు భారీస్థాయిలో బిజినెస్ జరుగుతుంది కాబట్టి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలుగులో ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో కృతిశెట్టి ఖాతాలో మూడు విజయాలు చేరాయి. 2డీ ఎంటర్‌టైన్స్‌మెంట్‌ బ్యానర్‌ పై జ్యోతిక, సూర్య సమర్పణలో ఈ సినిమా తెరకెక్కనుంది.

కృతిశెట్టి ప్రస్తుతం తెలుగులో కూడా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్నారు. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలు కృతిశెట్టి చేతిలో ఉన్నాయని తెలుస్తోంది. తెలుగులో స్టార్ హీరోల సినిమాలలో కూడా కృతిశెట్టికి అవకాశాలు దక్కితే ఆమె కెరీర్ కు మరింత మేలు జరుగుతుందని చెప్పవచ్చు. కెరీర్ విషయంలో కృతిశెట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కృతిశెట్టి కెరీర్ పరంగా మరింత ఉన్నత స్థానాలను ఎదగాలని అభిమానులు కోరుకుంటున్నారు.

హీరో, డైరెక్టర్ ను బట్టి కృతిశెట్టి రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుని క్రేజ్ పెంచుకున్న యంగ్ హీరోయిన్ కృతిశెట్టి మాత్రమే అని చెప్పాలి. ఉప్పెన మూవీ ఫుల్ రన్ లో 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించడం కృతికి ప్లస్ అయింది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus