Krithi Shetty: కృతి శెట్టికి ఇదే మంచి ఛాన్స్.. కన్ఫర్మ్ అయితే హిట్టు పక్కా..!

రష్మిక మొన్నటి వరకు టాలీవుడ్ ని ఓ ఊపు ఊపింది. ఆమె బిజీగా ఉన్న టైంలో కృతి శెట్టి వచ్చి హిట్లు అందుకుంది. ఆ తర్వాత ఇద్దరికీ ఛాన్సులు తగ్గాయి. కారణం.. వీళ్ళు నటించిన సినిమాలు వరుసగా ప్లాపులవ్వడం వల్లే అని చెప్పాలి.రష్మిక చేతిలో ఒకటి రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. అవి వర్కౌట్ అయితే మళ్ళీ బిజీ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ కృతి శెట్టికి శ్రీలీల నుండి గట్టి పోటీ ఉంది. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులన్నీ శ్రీలీల అకౌంట్లోనే ఉన్నాయి.

కృతి శెట్టి చేతిలో కేవలం శర్వానంద్ తో చేస్తున్న మూవీ మాత్రమే ఉంది. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్టు పై పెద్దగా అంచనాలు అయితే లేవు. అయితే ఇప్పుడు కృతి శెట్టికి ఓ క్రేజీ ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది. అది కూడా రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న మూవీలో కావడం విశేషం. గతంలో ఈ కాంబినేషన్లో ‘డాన్ శీను’ ‘బలుపు’ ‘క్రాక్’ వంటి సూపర్ హిట్లు వచ్చాయి.

ఇప్పుడు నాలుగో సినిమా కూడా రూపొందుతుంది. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ ప్రాజెక్టులో హీరోయిన్ గా ముందు రష్మిక ని అనుకున్నారు. కానీ ఆమె ఫైనల్ గా నో చెప్పడంతో కృతి శెట్టి వచ్చి చేరినట్టు తెలుస్తుంది.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus