Krithi Shetty: ఆడిషన్ కి పిలిస్తే నో చెప్పిన కృతి!

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఎంతో బిజీగా గడుపుతోంది కృతిశెట్టి. ఒక్కో సినిమాకి కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఈ బ్యూటీ డేట్స్ కావాలంటేనే కష్టమయ్యే పరిస్థితి.

అలాంటిది ఆమెని ఓ సినిమా కోసం ఆడిషన్ ఇవ్వమన్నారట. హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తోన్న ఆమెని పట్టుకొని ఆడిషన్ ఇవ్వమనేసరికి హర్ట్ అయినట్లు ఉంది. వెంటనే సినిమాకి నో చెప్పింది. అదొక బాలీవుడ్ ప్రాజెక్ట్ అని తెలుస్తోంది. బాలీవుడ్ లో ‘అందాదూన్’ లాంటి సినిమా తీసిన దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ తన నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా కృతిశెట్టిని తీసుకోవాలనుకున్నారు.

దానికి ఆమె కూడా ఓకే చెప్పిందట. కానీ ముంబై వచ్చి షూటింగ్ చేయమనడం కాకుండా ముందుగా ఆడిషన్స్ ఇవ్వమన్నారు. కొత్త హీరోయిన్లు అయితే క్యారెక్టర్ కి సెట్ అవుతారా..? లేదా..? అని ఆడిషన్స్ ఇవ్వమని అడుగుతారు. అన్నీ తెలిసి.. పాత్రకు సరిపోతానని అనుకున్న తరువాతే ఓకే అనుకుంది. కానీ మళ్లీ కొత్త హీరోయిన్ మాదిరిగా ఆడిషన్ అనేసరికి కృతి ఆ ఆఫర్ వదులుకున్నట్లు టాక్.

టాలీవుడ్ లో నాని, రామ్, నితిన్ లాంటి క్రేజ్ ఉన్న హీరోలతో నటిస్తూ వస్తోన్న కృతిశెట్టికి ఆ మాత్రం యాటిట్యూడ్ ఉండడంలో తప్పులేదు. కానీ బాలీవుడ్ ఆఫర్ అనేసరికి ఆమె తగ్గుతుందేమో అనుకున్నారు. కృతి మాత్రం అలా చేయలేదు. ప్రస్తుతం ఈమె కోలీవుడ్ లో కూడా సినిమాలు ఒప్పుకుంటుంది. రీసెంట్ గా మలయాళంలో కూడా ఓ సినిమా సైన్ చేసింది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus