Krithi Shetty: అప్పుడు మొదలైన పెరుగన్నం.. వదలడం లేదు!

తొలి సినిమాలో పాత్ర పేరును ఆ హీరోయిన్‌కి మారుపేరుగా మార్చేశారు అంటే.. ఆ పాత్రలో ఆమె ఎంతగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. అంతలా అదరగొట్టి బేబమ్మగా మారిపోయింది కృతి శెట్టి. ‘ఉప్పెన’ సినిమాలో బేబమ్మగా కనిపించి కుర్రకారు గుండెని మెలితిప్పేసింది తుళు పిల్ల. అయితే ఆ సినిమా కోసం ఆమె ఎంత కష్టపడింది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో తెలుసా? అయితే ఈ వార్త చదవండి మీకు మొత్తం అర్థమవుతుంది. ‘సూపర్‌ 30’ సినిమాలో కృతి తొలుత నటించిన విషయం తెలిసిందే.

ఆ తర్వాత ఒకతను ఆమెకు చెప్పకుండానే ‘ఉప్పెన’ డైరెక్టర్‌ బుచ్చిబాబుకు ఫొటోలు పంపాడట. బుచ్చిబాబు వెంటనే కృతి వాళ్ల తల్లిదండ్రుల్ని కాంటాక్ట్‌ అయ్యారట. తొలుత వద్దనుకున్నా, కుటుంబ సభ్యులు చెప్పడంతో కృతి ఒప్పుకుందట. కథ విని, పాత్ర గురించి తెలిశాక.. బేబమ్మ పాత్రలో లీనమైపోయి పల్లెటూరి అమ్మాయిలు ఎలా ఉంటారు, ఎలా నడుస్తారు, ఏ సందర్భంలో ఎలా స్పందిస్తారనే విషయాల్ని తెలుసుకుందట కృతి. హీరోయిన్లను పల్లెటూరి అమ్మాయిలా చూపించిన తెలుగు సినిమాలను చూసి ఓ నోట్స్‌ రాసుకుందట కృతి.

ఈ క్రమంలోనే తెలుగులో మాట్లాడటం కూడా నేర్చుకోవడం మొదలుపెట్టింది. మరోవైపు దర్శకుడు బుచ్చిబాబు కూడా కొన్ని వర్క్‌ షాప్స్‌ పెట్టారట. అలాగే సెట్‌లో తెలుగులోనే మాట్లాడాలనే షరతు పెట్టడంతో షూటింగ్‌ సమయంలో టీమ్‌ అందరితో తెలుగులోనే మాట్లాడిందట కృతి. టీమ్‌ చెప్పేది వింటూ తెలుగు ప్రాక్టీస్‌ చేసిందట. పుట్టింది కర్నాటకలో అయినా.. పెరిగిందంతా ముంబయిలో కావడంతో చపాతీ, రోటీ తినడం అలవాటట కృతికి.

ఎప్పుడో కానీ ఇంట్లో అన్నం తినేవారు కాదట. అయితే బేబమ్మ పాత్ర కోసం కాస్త బరువు పెరగమని దర్శకుడు చెప్పారట. దీంతో అన్నం, స్వీట్లు బాగా తినిందట. మొదటిసారి పెరుగన్నం తినడం కూడా అప్పుడే అలవాటు చేసుకుందట. ఇప్పుడేమో పెరుగున్నం అలవాటైపోయి తినకుండా ఉండలేకపోతోందట. ఇక స్వీట్స్‌ అన్నా చాలా ఇష్టమని చెప్పింది కృతి. ఇటీవల ఆమె నటించన ‘వారియర్‌’ విడుదలైంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus