కైరా అద్వానీ స్థానంలో కృతి కర్బందా!

హీరోయిన్స్ గా మంచి పేరు తెచుకునేవాళ్ళు చాలామంది బాలీవుడ్ వైపే చూస్తుంటారు. అక్కడ కొన్ని సినిమాలు చేస్తే తమ లైఫ్ మారిపోతుందని వారి నమ్మకం. అందుకే హిందీ సినిమాల్లో చిన్న అవకాశం వచ్చినా వదులుకోరు. అలాగే బోనీ, తీన్మార్, బ్రూస్లీ వంటి సినిమాల్తో తెలుగు వారికి దగ్గరైన ఢిల్లీ బ్యూటీ కృతి మంచి అవకాశం రాగానే పట్టేసింది. బాలీవుడ్ లో హౌస్ ఫుల్ సినిమా మంచి విజయం సాధించింది. ఈ మూవీ ఇప్పటికే మూడు భాగాలుగా రిలీజ్ అయి ఆకట్టుకుంది. ఇప్పుడు నాలుగో భాగం ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌, బాబీ డియోల్ హీరోలుగా నటిస్తున్నారు.

వారికీ జోడీగా ‘1 నేనొక్కడినే’ బ్యూటీ కృతి సనన్, ‘డీజే’ భామ పూజా హెగ్డే లను ఓకే చేశారు. మూడో హీరోయిన్ పాత్రకు కైరా అద్వానీ(భరత్ అనే నేను ఫేమ్ )ని ఫిక్స్ చేసారు. ఆమె స్థానాన్ని కృతి కర్బందా తన్నుకు పోయినట్లు సమాచారం. రితేష్ దేశ్‌ముఖ్‌కు జోడీగా కైరాను ముందు అనుకున్నారు. ఆమె కంటే కృతి కర్బందా బాగా సెట్ అవుతుందని చిత్ర యూనిట్ లో ఎక్కువమంది సూచించడంతో ఆమెనే తీసుకున్నారు. హౌస్ ఫుల్ 4 సినిమా కృతి కర్బందా కెరీర్ కి ఎంతమేర హెల్ప్ అవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus