Prabhas, Kriti Sanon: ప్రభాస్ తో బాగా క్లోజ్ అయిపోయిన హీరోయిన్ కృతి సనన్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న చిత్రాల్లో ‘ఆదిపురుష్’ సినిమా ఒకటి. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తే.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించబోతుంది. ఈ సినిమా సెట్స్ లో హీరో, హీరోయిన్లు ఇద్దరూ బాగా కలిసిపోయారట. ఈ విషయాన్ని కృతి సనన్ స్వయంగా చెప్పుకొచ్చింది. ప్రభాస్ కి మొహమాటం ఎక్కువని చాలామంది చెబుతుంటారని.. కానీ అతడితో పరిచయమైన తరువాత అవన్నీ తప్పని రుజువయ్యాయంటోంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

అంతేకాదు.. ఓ విషయంలో తను, ప్రభాస్ బాగా కలిసిపోయామని చెబుతోంది. ప్రభాస్ పెద్దగా మాట్లాడడు అని చాలామంది తనతో చెప్పారని.. కానీ తన విషయంలో దానికి పూర్తి విరుద్ధంగా జరుగుతోందని చెప్పింది. మొదటిసారి ప్రభాస్ తో మాట్లాడినప్పుడు కాస్త మొహమాటంగా హాయ్ చెప్పారని.. ఆ తరువాత బాగా కలిసిపోయామని చెప్పుకొచ్చింది.

ప్రభాస్ చాలా మాటకారి అని.. చాలా సరదాగా ఉంటారని. మా ఇద్దరికీ ఓ కామన్ పాయింట్ ఉందని చెప్పింది. ప్రభాస్ ఫుడ్ బాగా ఇష్టపడతాడని.. తనకు కూడా ఫుడ్ అంటే బాగా ఇష్టమని.. బహుశా అదే మా ఇద్దరినీ దగ్గర చేసిందనుకుంటా అని చెప్పుకొచ్చింది. ఇలా ప్రభాస్, తను బాగా కలిసిపోయామని చెబుతోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ‘ఆదిపురుష్’ షూటింగ్ ముంబైలో జరుగుతోంది.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus