Kriti Sanon: ఆది పురుష్ డబ్బింగ్ పనులను మొదలుపెట్టిన కృతి సనన్!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వంలో రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇక ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో బిలియన్ సంఖ్యలో వ్యూస్ సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ విధంగా ఈ టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నప్పటికీ ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కొంది. ఇప్పటికీ ఈ సినిమా టీజర్ పై ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి మరొక అప్డేట్ బయటికీ వచ్చింది. ఇటీవల షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ కి సిద్ధమైనట్లు తెలుస్తొంది.

ఈ విషయాన్ని కృతి సనన్ స్వయంగా వెల్లడించింది. ‘గెట్ సెట్ డబ్ ‘ అంటూ కృతి సనన్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. ఈ సినిమాలో తన పాత్రకి డబ్బింగ్ ప్రారంభమైనట్లు కృతి సనన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కృతి సనన్ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. రాధే శ్యామ్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా హిట్ అవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

ఇక రాముడు పాత్రలో ప్రభాస్ లుక్ పట్ల అభిమానులు కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. ఇలా ఎన్నో వివాదాలు విమర్శలు నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అయితే ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో హిట్ గా నిలుస్తుందా? లేదా? చూడాలి మరి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus