టాలీవుడ్లో అడుగుపెడుతున్న మహేష్ హీరోయిన్ చెల్లెలు..!

  • March 31, 2022 / 11:46 PM IST

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న భామలు తమ చెల్లెళ్లను కూడా హీరోయిన్లుగా పరిచయం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆర్తి అగర్వాల్- అదితి అగర్వాల్, కాజల్ అగర్వాల్- నిషా అగర్వాల్.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది. రేపో మాపో సాయి పల్లవి చెల్లెలు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే దీనికి భిన్నంగా టాలీవుడ్లో సక్సెస్ కాలేకపోయిన ఓ హీరోయిన్ చెల్లెలు ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది.

Click Here To Watch NOW

వివరాల్లోకి వెళ్తే… మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌’ అధినేత అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న చిత్రమిది.రవితేజ కెరీర్‌లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ. వంశీ కృష్ణ ఆకెళ్ళ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి నుపూర్ సనన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన కృతి సనన్ చెల్లెలు.

మహేష్ బాబు- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కృతి సనన్.. ఆ చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంది కానీ, ఆ చిత్రం డిజాస్టర్ కావడంతో ఈమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన ‘దోచేయ్’ లో నటించినా ఆ మూవీ కూడా సక్సెస్ కాలేదు. మరి ఆమె చెల్లెలు నుపూర్ అయినా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి..! ఈమె కృతిలానే ఓ మోడల్ కూడా..! ఈమె బాలీవుడ్లో పలు మ్యూజిక్ వీడియోస్ లో కూడా మెరిసింది.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus