Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » “క్షణక్షణం” సినిమా నచ్చి రిలీజ్ చేస్తున్నాం – ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాస్

“క్షణక్షణం” సినిమా నచ్చి రిలీజ్ చేస్తున్నాం – ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాస్

  • February 18, 2021 / 07:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“క్షణక్షణం” సినిమా నచ్చి రిలీజ్ చేస్తున్నాం –  ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిర్మాత బన్నీ వాస్

మన మూవీస్ బ్యానర్ లో ఉదయ్ శంకర్, జియా శర్మ హీరో హీరోయిన్లుగా కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో నిర్మించిన సినిమా క్షణ క్షణం. డార్క్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కింది. క్షణ క్షణం సినిమా ఈ నెల 26న గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలకు సిద్దం అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. లక్కీ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ…రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేస్తున్నప్పుడు కొన్ని లెక్కలు వేసుకుని చేస్తాం. కానీ ప్రయోగాత్మక చిత్రాలు నిర్మించేందుకు ధైర్యం కావాలి. ఇటీవల చావు కబురు చల్లగా సినిమా చేస్తున్నప్పుడు నేను అది ఎక్సీపిరియన్స్ చేశాను. క్షణక్షణంతో అలాంటి ధైర్యం చేసిన వర్ల గారిని, మౌళి గారిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. సినిమా నచ్చడంతో గీతా ఫిలింస్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి డిఫరెంట్ ఫిలింస్ వస్తే ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ పరిచయం అవుతుంది. కొత్త నటీనటులు, దర్శకులు ఇండస్ట్రీకి వస్తారు. క్షణక్షణం సినిమాను చూడమని చాలా మందికి రిఫర్ చేశాను. ఉదయ్ శంకర్ ను ఆయన మొదటి సినిమా ఆటగదరా శివ నుంచి చూస్తున్నాను. విభిన్నమైన కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్నారు. ఇష్టంతో కష్టపడితే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి వస్తారు. నాకు సినిమా అంటే ప్యాషన్. నాకే బ్యాక్ గ్రౌండ్ లేదు. సినిమాను ప్రేమించాను కాబట్టి ఇప్పుడీ స్థాయిలో ఉన్నాను. వారసులకైనా మొదటి ఆట వరకే అడ్వాంటేజ్ ఆ తర్వాత వాళ్లు ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఉదయ్ శంకర్ క్షణక్షణంతో ప్రేక్షకులను మెప్పిస్తాడని అనుకుంటున్నా. అన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ: మమ్మల్ని మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న బన్నీ వాస్ గారికి చాలా థ్యాంక్స్. సినిమా నచ్చి ఆయన తనే డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముందుకొచ్చారు. గీతా ఫిలింస్ లో మా సినిమా రిలీజ్ కావడం గౌరవంగా భావిస్తున్నా. బన్నీ వాస్ గారు మాకు మాకు చాలా సలహాలు, సూచనలు ఇచ్చారు. క్షణక్షణం ట్రైలర్ చూశారు కదా ట్రైలర్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో, సినిమా కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇష్టపడి కష్టపడి సినిమా చేశాం. నాకింత మంచి సినిమా ఇచ్చిన దర్శకుడు కార్తీక్ కు థ్యాంక్స్. సంగీత దర్శకుడు కోటి గారు ఓ మంచి క్యారెక్టర్ చేశారు. ఆయనతో నటించడం సంతోషంగా ఉంది. అన్నారు.

దర్శకుడు కార్తిక్ మేడికొండ మాట్లాడుతూ: బన్నీ వాస్ గారి సపోర్ట్ మర్చిపోలేం. తమన్నా గారికి కూడా థ్యాంక్స్, ఆమె ట్విట్టర్ ద్వారా మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. చిన్న సినిమాను ప్రేక్షకులు చూడాలంటే కొత్తగా ఏదైనా ఉండాలి. క్షణక్షణంలో కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. క్యారెక్టర్లు ఆకట్టుకుంటాయి. ట్రైలర్ లో కొన్ని విషయాలు మేం చెప్పలేదు. అలా దాచిన వాటిలో రఘు కుంచె గారి క్యారెక్టర్ ఒకటి. ఆయన రోల్ షాకింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులకు కూడా క్షణక్షణం ఖచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నా. డెఫనెట్ గా సినిమాను ఎంజాయ్ చేస్తారు.

సంగీత దర్శకుడు రోషన్ సాలూరి మాట్లాడుతూ…క్షణక్షణం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసేప్పుడు చాలా సార్లు బన్నీ వాస్ గారు మా స్టూడియోకు వచ్చారు. చాలా కేర్ తీసుకున్నారు. దర్శకుడు కార్తీక్ టాలెంటెడ్, మ్యూజిక్ కు స్వేచ్ఛ నిచ్చి చేయించారు. ఎలా చేస్తున్నారు, ఏంటి అని ఒక్క రోజుకూడా అడగలేదు. నా మీద అంత నమ్మకం ఉంచి మ్యూజిక్ చేయించారు. అని చెప్పారు.

నిర్మాత డాక్టర్ వర్లు మాట్లాడుతూ…వాల్ట్ డిస్నీకి సినిమాలే ప్రపంచం. ఆయన సంపాదన అంతా సినిమా మేకింగ్ మీద పెట్టేవాడు. అంత ప్యాషన్ సినిమాలు అంటే. నేను అదే ప్యాషన్ ను ఉదయ్ లో చూశాను. వాళ్ల నాన్న నాకు ఫ్రెండ్. మెడిసిన్ చదవమంటే సినిమాలపై ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు. తను కోరుకున్న రంగంలో ముందుకు వెళ్లమని ఉదయ్ కు చెబుతున్నా. తాడో పేడో ఇక్కడే తేల్చుకో. దర్శకుడు కార్తీక్ తనకు తెలియకుండానే ఒక సూపర్ హిట్ సినిమా ఫార్ములాను క్షణక్షణం కథలో వాడాడు. కొత్తగా ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. అన్నారు.

రఘు కుంచె మాట్లాడుతూ..క్షణక్షణం అనే టైటిల్ పెట్టినప్పుడే మంచి రెస్పాన్స్ వచ్చింది. అది వెంకటేష్ గారి సినిమా. మేము మంచి లాక్ డౌన్ లో షూటింగ్ చేశాం. మా నిర్మాత డాక్టర్ గారు కాబట్టి ధైర్యంగా సెట్స్ కు వెళ్లే వాళ్లం. ఆయన మాకు మందులు ఇచ్చేవారు. కొత్త సినిమాలో ఏముంటుంది అనే ఆడియెన్స్ అనుకుంటారు. దాంతో కొత్త దర్శకులు, నటులు తమ సినిమాల్లో కథలు కొత్త కాన్సెప్ట్ లతో చేస్తున్నారు. నేను ఓ డిఫరెంట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. అన్నారు.

నాయిక జియా శర్మ మాట్లాడుతూ…నాకు కథ చెప్పినప్పుడు ఒక ఫీల్ కలిగింది. కథలోని మలుపులు బాగా నచ్చాయి. అందుకే వెంటనే సినిమా ఒప్పుకున్నాను. కథను సినిమాగా చెప్పడం అంటే ఒక ఆర్ట్. అది మా దర్శకుడు కార్తీక్ లో చాలా ఉంది. రేపు సినిమా చూసిన ప్రేక్షకులు కూడా ఒక మంచి అనుభూతికి లోనవుతారు. అన్నారు.

ఉదయ్ శంకర్ ,జియాశర్మ హీరోహీరోయిన్లు గా నటించే ఈసినిమా లో శ్రుతిసింగ్ మ్యూజిక్ దర్శకుడు కోటి ,రఘుకుంచె , రవి ప్రకాశ్, గిఫ్టన్ ఇతర ముఖ్య పాత్రను పోషిస్తున్నారు.

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jia Sharma
  • #Koti
  • #Kshana Kshanam
  • #Raghu Kunche
  • #Ravi Prakash

Also Read

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

related news

Aranya Dhara: మైథలాజికల్ అండ్ సస్పెన్స్  థ్రిల్లర్ మూవీ ‘అరణ్య ధార’ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల

Aranya Dhara: మైథలాజికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘అరణ్య ధార’ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల

ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఆగస్టు 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా “థాంక్యూ డియర్” చిత్ర ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

trending news

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

17 hours ago
War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

17 hours ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

19 hours ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

20 hours ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

24 hours ago

latest news

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

20 hours ago
Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

1 day ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

2 days ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version