Kumari 21F Collections: ‘కుమారి 21 ఎఫ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేస్తుందంటే?

Ad not loaded.

రాజ్ తరుణ్  (Raj Tarun) హీరోగా హెబ్బా పటేల్ (Hebah Patel ) హీరోయిన్ గా పలనాటి సూర్య ప్రతాప్ (Palnati Surya Pratap) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కుమారి 21 ఎఫ్’ (Kumari 21F). ‘సుకుమార్  రైటింగ్స్’ ‘పిఎ మోషన్ పిక్చర్స్’ బ్యానర్లపై బండ్రెడ్డి విజయ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుకుమార్ (Sukumar) ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడం విశేషంగా చెప్పుకోవాలి. టాలీవుడ్లో వచ్చిన పాత్ బ్రేకింగ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి అని చెప్పాలి. 2015 నవంబర్ 20న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ అందుకుంది.

Kumari 21F Collections:

నేటితో ఈ చిత్రం విడుదలై 9 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఫుల్ రన్లో ఈ చిత్రం (Kumari 21F ) ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 5.16 cr
సీడెడ్ 1.26 cr
ఉత్తరాంధ్ర 1.30 cr
ఈస్ట్ 0.82 cr
వెస్ట్ 0.69 cr
గుంటూరు 0.82 cr
కృష్ణా 0.90 cr
నెల్లూరు 0.25 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.20 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.90 cr
ఓవర్సీస్ 1.00 cr
వరల్డ్ వైడ్ టోటల్ 13.10 cr

‘కుమారి 21 ఎఫ్’ చిత్రం రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.13.1 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.4.1 కోట్ల లాభాలను అందించి సూపర్ హిట్ గా నిలిచింది.

మహేష్ ఫ్యామిలీ లేటెస్ట్ ఫోటోల వెనుక ఉన్న అసలు కథ ఇదేనా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus