Guntur Kaaram Song: ‘గుంటూరు కారం’ నుండి 3వ పాట వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • December 30, 2023 / 04:39 PM IST

మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అతడు’ ‘ఖలేజా’ తర్వాత వస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ సంస్థ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఆల్రెడీ ఈ చిత్రం నుండి 2 పాటలు రిలీజ్ అయ్యాయి.

మొదటి పాట ‘దమ్ మసాలా’ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రెండో పాట ‘ఓ మై బేబీ’ కి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ‘కుర్చీ మడతపెట్టి’ అనే 3వ పాట రిలీజ్ అయ్యింది. ‘రాజమండ్రి రాగమంజరి మా అమ్మ పేరు తెలియనోళ్లు లేరు మేస్తిరి’ అంటూ మొదలైన ఈ పాట మొదటి నుండే మంచి హై ఇచ్చేలా ఉంది.సింగర్స్ సాహితి చాగంటి, శ్రీకృష్ణ..ఎంతో హుషారుగా ఆలపించారు అని చెప్పాలి.సంగీత దర్శకుడు తమన్ అందించిన ట్యూన్ బాగానే ఉంది. కాకపోతే లిరిక్స్ కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పాలి.

ఇదే కనుక ఐటెం సాంగ్ అయితే అలాంటి వంకలు పెట్టాల్సిన పని లేదు. కానీ హీరోయిన్ శ్రీలీలతో హీరో మహేష్ బాబుకు ఉన్న స్పెషల్ మాస్ సాంగ్ ఇది. కాబట్టి.. కొంచెం లిరిక్స్ ఇబ్బంది పెట్టేలా అనిపిస్తున్నాయి. ఈ విషయంలో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి పై నెటిజన్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే మహేష్ బాబు – శ్రీలీల..ల డాన్స్ మూమెంట్స్ మాత్రం ఈ లిరికల్ సాంగ్ కి హైలెట్ గా నిలిచే అవకాశం ఉంది. వాటి కోసమైనా 2,3 సార్లు ఈ లిరికల్ సాంగ్ చూడొచ్చు. మీరు కూడా ఒకసారి చూస్తూ వినెయ్యండి :

డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

బబుల్ గమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఖైదీ నెంబర్ 786’ టు ‘ఠాగూర్’.. తెలుగులో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus