Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

‘ఓజి’ నుంచి రిలీజైన ‘సువ్వి సువ్వి’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అందులోని ఒకే ఒక్క సీన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్‌ల మధ్య వచ్చే దీపం సీన్, 24 ఏళ్ల క్రితం వచ్చిన ఇండస్ట్రీ హిట్ ‘ఖుషి’ని గుర్తుచేస్తోంది. దీంతో “దీపం సెంటిమెంట్” రిపీట్ అయిందని, ‘ఓజి’ కూడా ఆ రేంజ్ బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఒక డై-హార్డ్ ఫ్యాన్ పక్కా ప్లాన్‌తో పెట్టిన సీన్.

Kushi – OG

‘గబ్బర్ సింగ్’ టైమ్‌లో థియేటర్ బయట సందడి చేసిన సుజిత్, పవన్‌ను ఎలా చూపిస్తే ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ వస్తాయో పర్ఫెక్ట్‌గా క్యాచ్ చేశాడు. పాటగా కూడా ‘సువ్వి సువ్వి’ అదరగొట్టింది. థమన్ కంపోజిషన్‌లో, శ్రుతి రంజని గాత్రంతో ఈ మెలోడీ విన్న వెంటనే కనెక్ట్ అవుతోంది. విజువల్స్‌లో పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. గంభీర లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌కు జోడీగా, కన్మణి పాత్రలో ప్రియాంక పర్ఫెక్ట్‌గా సెట్ అయింది.

వీరిద్దరి ఫ్రెష్ కాంబినేషన్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఈ ఒక్క సాంగ్‌తోనే క్లారిటీ వచ్చేసింది.90ల గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో, ఓజస్ గంభీర అనే పవర్‌ఫుల్ పాత్రలో సుజిత్ పవన్‌ను ప్రెజెంట్ చేస్తున్న తీరు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చింది. మరి ఈ ‘ఖుషి’ సెంటిమెంట్ వర్కౌట్ అయి, 2025 సెప్టెంబర్ 25న ‘OG’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తుందేమో చూడాలి.

నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus