సినిమా ఇండస్ట్రీలో నెపోటిజం అనేది చాలా కామన్. అయితే.. కేవలం నెపోటిజం వల్ల స్టార్స్ అయిపోరు అనే విషయం కూడా ఎప్పటికప్పుడు ప్రూవ్ అవుతూనే ఉంది. అందుకు తాజా ఉదాహరణగా ఖుషీ కపూర్ (Kushi Kapoor) & ఇబ్రహీం అలీఖాన్ నిలుస్తున్నారు. శ్రీదేవి (Sridevi) -బోనికపూర్ (Boney Kapoor) ల రెండోవ కుమార్తె ఖుషీ కపూర్ “ఆర్చీస్” అనే నెట్ ఫ్లిక్స్ ఫిలింతో డెబ్యూ చేసినప్పటికీ.. అప్పుడు అందరి దృష్టి షారుక్ ఖాన్ కుమార్తె సుహానా మీద పడడంతో ఖుషీ కపూర్ తప్పించుకుంది.
అయితే.. ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన “నాదానియా” అనే సినిమాలో ఖుషీ కపూర్ (Kushi Kapoor) నటన చూసినవాళ్లందరూ “ఇదేం నటనరా బాబు?!” అని ఈసడించుకుంటున్నారు. ఎంత శ్రీదేవి కూతురు అయితే మాత్రం కనీస స్థాయి టాలెంట్ లేకుండా ఆడియన్స్ మీద రుద్దడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ కోప్పడ్డారు కూడా. అలాగే.. సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) కుమారుడు ఇబ్రహీం విషయంలో కూడా అదే తరహా కామెంట్స్ వినిపిస్తున్నారు.
ఈమధ్యకాలంలో ఒక సినిమా ఈస్థాయిలో ట్రోల్ అవ్వడం, అది కూడా లీడ్ పెయిర్ ఇద్దర్నీ దారుణంగా ట్రోల్ చేయడం అనేది బహుశా “నాదానియా” విషయంలోనే జరిగి ఉంటుంది. ముఖ్యంగా.. ఖుషీ కపూర్ నటన కంటే లుక్స్ ను సైతం నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన బొమ్మలా ఉందని, ఎక్కడా సుకుమారం అనేదే కనిపించడం లేదని కూడా కొందరు వ్యాఖ్యానించారు.
దీన్నిబట్టి చూస్తే ఖుషీ కపూర్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పేరు సంపాదించుకోవడం అటుంచితే.. కనీసం గుర్తింపు సంపాదించుకోవడం కూడా కష్టమే. ఎందుకంటే.. అందంగా లేకపోయినా కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా చేయొచ్చు కానీ.. కనీస స్థాయి నటన రాకపోతే మాత్రం నిలదొక్కుకోవడం అనేది కష్టమే!