Kushi: విజయ్ – సమంత..ల ‘ఖుషి’ మూవీ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘ఖుషి’. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై.రవి శంకర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నిటికీ ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. టీజర్, ట్రైలర్ వంటివి కూడా ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ – సమంత ల మధ్య వచ్చే సన్నివేశాలు యూత్ ని ఆకర్షించే విధంగా ఉన్నాయి.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అన్నీ అదిరిపోతాయి అనే ఆశలు రేకెత్తించాయి. సెప్టెంబర్ 1 న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ల డోస్ కూడా పెంచింది చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వీక్షించిన తర్వాత ఎటువంటి కట్స్ చెప్పకుండా సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేసారని సమాచారం.

అంతేకాకుండా క్లాస్, మాస్.. అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం ఉందని వారు ప్రశంసించారు. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ ఆ స్థాయిలో మరో విజయాన్ని అందుకోలేదు. ‘ఖుషి’ (Kushi) సినిమా తప్పకుండా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబడుతుంది అని వారు చెప్పినట్లు సమాచారం.

మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!

ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus