Kushi Collections: 4వ రోజు కూడా కుమ్మేసిన ‘ఖుషి’.. పాత సినిమాకి ఇంత భీభత్సమా?

  • January 4, 2023 / 05:05 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను స్టార్ హీరోని చేసిన సినిమా ‘ఖుషి’. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైం హిట్ మూవీస్ లో ఇది కూడా ఒకటని చెప్పాలి. అలాంటి ‘ఖుషి’ 22 ఏళ్ళ తర్వాత 4K లో రీ రిలీజ్ అయ్యింది. 2023 కి వెల్కమ్ చెబుతూ ‘న్యూ ఇయర్’ కానుకగా ఈ చిత్రం 2022 డిసెంబర్ 31న రిలీజ్ అయ్యింది. దీంతో అభిమానులు మాత్రమే కాకుండా ‘ఖుషి’ సినిమా అభిమానులు అందరూ మరోసారి ‘ఖుషి’ చిత్రాన్ని బిగ్ స్క్రీన్స్ లో ఆస్వాదించాలని ఎంతో ఆసక్తితో పరుగులు తీశారు.

దీంతో రీ రిలీజ్ సినిమాల్లో ఈ మూవీ బెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 1.62 cr
సీడెడ్ 0.48 cr
ఆంధ్ర 1.66 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 3.76 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.39 cr
ఓవర్సీస్ 0.18 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 4.33 cr

‘ఖుషి’ చిత్రం రీ రిలీజ్ లో కూడా బాక్సాఫీస్ వద్ద తన హవా చూపిస్తుంది. కొత్త సినిమాలు ఏమీ లేకపోవడంతో రీ రిలీజ్ చేయడం ‘ఖుషి’ కి బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. రీ రిలీజ్ అయిన 4 రోజుల్లో ఈ మూవీ రూ.4.33 కోట్ల షేర్ ను రాబట్టి ట్రేడ్ కు సైతం షాకిచ్చింది.

జనవరి 6 వ తారీఖు వరకు ‘ఖుషి’ థియేటర్లలో అందుబాటులో ఉంటుంది. మరి రీ రిలీజ్ లో ఫైనల్ గా ‘ఖుషి’ ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఇప్పటికైతే రీ రిలీజ్ అయిన సినిమాల్లో ‘ఖుషి’ నే నెంబర్ 1 గా నిలిచింది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus