అమీర్ ఖాన్ హీరోగా నాగచైతన్య కీలక పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా మరో 36 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పరిమిత సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది. ప్రధానంగా మల్టీప్లెక్స్ లలో ఈ సినిమా విడుదలవుతోంది. నాగచైతన్య ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించినా ఈ సినిమా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం. ఏఎంబీ సినిమాస్ లో ఈ సినిమా ఒక షో మాత్రమే ప్రదర్శితం కానుండగా ఆ షోకు కూడా టికెట్లు ఎక్కువగా బుకింగ్ కాలేదు.
గత నెలలో విడుదలైన థాంక్యూ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాలేదనే సంగతి తెలిసిందే. లాల్ సింగ్ చద్దా సినిమాకు కూడా ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. అమీర్ ఖాన్ మాత్రం ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందని ఆశలు పెట్టుకున్నారు.
భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా సోషల్ మీడియాలో ఈ సినిమాను బ్యాన్ చేయాలని హ్యాష్ ట్యాగ్స్ వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ గతంలో చేసిన కామెంట్లు ఈ సినిమాకు మైనస్ అవుతుండటం గమనార్హం. బింబిసార, సీతారామం ఇప్పటికే పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రదర్శితమవుతున్నాయి. ఈ సినిమాలను మించిన టాక్ వస్తే మాత్రమే లాల్ సింగ్ చద్దా సక్సెస్ సాధించే అవకాశాలు ఉంటాయి.
మరోవైపు మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ2 సినిమాలు కూడా ఈ వారమే థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 25వ తేదీన లైగర్ సినిమా రిలీజ్ కానుండటంతో ఆ సినిమా వల్ల థియేటర్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని భావించి నితిన్, నిఖిల్ తమ సినిమాలను 12, 13 తేదీలలో థియేటర్లలో విడుదల చేస్తుండటం గమనార్హం.