ఆమిర్ ఖాన్ హీరోగా కరీనా కపూర్ హీరోయిన్ గా నాగ చైతన్య కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ – కిరణ్ రావ్ – జ్యోతి దేశ్ పాండే – అజిత్ అందరే కలిసి అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ – వయాకామ్ 18 బ్యానర్ల పై నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి సమర్పణలో రిలీజ్ చేయడంతో అంచనాలు ఏర్పడ్డాయి.
కానీ ఆగస్టు 11న విడుదలైన ‘లాల్ సింగ్ చడ్డా’ మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ను మూటకట్టుకుంది. ఆమిర్ ఖాన్ ‘పీకే’ లో చేసిన యాక్టింగే మళ్ళీ చేశాడు అంటూ ప్రేక్షకులు పెదవి విరిచారు. దీంతో మొదటి రోజు ఈవెనింగ్ షోలకే కలెక్షన్లు డౌన్ అయిపోయాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
0.26 cr
సీడెడ్
0.09 cr
ఆంధ్ర
0.14 cr
ఏపీ + తెలంగాణ
0.49 cr
‘లాల్ సింగ్ చడ్డా’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.చాలా వరకు అడ్వాన్స్ బేసిస్ పైనే ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే … రూ.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఆమిర్ ఖాన్ చిత్రాలకు తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు.
నాగ చైతన్య ఉన్నాడు కాబట్టి.. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున కూడా కొన్ని ఏరియాల్లో ఓన్ రిలీజ్ చేసుకున్నారు.అయితే ‘సీతా రామం’ ‘బింబిసార’ వంటి సూపర్ హిట్ చిత్రాలు ఉండడంతో ఈ మూవీ నిలబడలేకపోయింది. పైగా తర్వాత రోజు ‘మాచర్ల నియోజకవర్గం’ ‘కార్తికేయ2’ వంటి చిత్రాలు కూడా రిలీజ్ అవ్వడంతో ‘లాల్ సింగ్ చడ్డా’ ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు. దీంతో ఇక్కడ కూడా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది ఆ మూవీ.