Prabhas: ప్రభాస్ చంప చెల్లుమనిపించిన లేడీ ఫ్యాన్… హీరో రియాక్షన్ ఇదే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోవడంతో ఈయనకు దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ఇతర దేశాలలో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఇలా హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ కి సంబంధించి ఎలాంటి న్యూస్ బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించినటువంటి ఒక పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇందులో భాగంగా ప్రభాస్ (Prabhas) ఎయిర్ పోర్ట్ లో నడుచుకుంటూ వస్తుండగా మహిళా అభిమాని ప్రభాస్ తో సెల్ఫీ దిగడం కోసం పరుగున వెళ్లింది. అయితే ఆమె ఎక్సైట్మెంట్ చూసినటువంటి ప్రభాస్ తనతో సెల్ఫీ దిగడానికి ఒప్పుకున్నారు అయితే సెల్ఫీ దిగిన అనంతరం ప్రభాస్ తో తాను సెల్ఫీ దిగానన్న ఆనందంతో ఆ మహిళ ప్రభాస్ చెంపపై సరదాగా కొట్టింది. ఇలా ప్రభాస్ చెంపపై సరదాగా కొట్టడంతో ఒకసారి షాక్ అయినటువంటి ప్రభాస్ ఆమె ఆనందం చూసి నవ్వుతూ అలా ఉండిపోయారు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వచ్చినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగడం సర్వసాధారణం అయితే ఇదంతా కేవలం వారిపై అభిమానంతో మాత్రమేనని సెలబ్రిటీలు కూడా చూసి చూడనట్టు వెళుతుంటారు. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన సలార్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది

సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు మారుతి డైరెక్షన్లో మరొక సినిమా చేస్తున్నారు అలాగే కల్కి సినిమాతో పాటు స్పిరిట్ సినిమాలలో కూడా ప్రభాస్ నటిస్తూ బిజీగా ఉన్నారు.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus