ఆదిత్య మ్యూజిక్ కు ‘లగ్గం’ ఆడియో రైట్స్

  • June 15, 2024 / 11:00 PM IST

సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన -దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిలో ఉండే సంబరాన్ని, విందుని, చిందుని, కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది కల్చరర్ ఫ్యామిలీ డ్రామా ప్రతి ఒక్కరు ఈ చిత్రం చూసి మాట్లాడుకుంటారు, కొత్త ఎక్స్పీరియన్స్ కళ్ళముందు ఉంచే ఈ చిత్రం కొన్ని తరాలు గుర్తుంచుకునే చిత్రమవుతుందని నటకిరిటి రాజేంద్రప్రసాద్ గారు తెలిపారు.

షూటింగ్ పూర్తి చేసుకొని శర వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న లగ్గం సినిమా పాటలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం అందించారు. ప్రముఖ ఆడియో కంపెనీ అయిన ఆదిత్య మ్యూజిక్ సంస్థ లగ్గం ఆడియో రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకోవడం విశేషం. జూన్ 21న ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ లగ లాగ లగ్గం సాంగ్ అందరిని ఆలరించనుందని వేణు గోపాల్ రెడ్డి గారు అన్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus