ఆదిపురుష్ లొ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్

ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో మోస్ట్ యాంబీషియస్ ప్రోజెక్ట్ “ఆదిపురుష్”. బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ తెరకెక్కించనున్న ఈ భారీ బడ్జెట్ ఫాంటసీ డ్రామా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వడం, మొదటి రోజే సెట్ కాలిపోవడం, సెట్ మళ్ళీ కట్టేయడం కూడా అయిపోయింది. అయితే.. ఇప్పటివరకూ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది మాత్రం ఫిక్స్ అవ్వలేదు. అనుష్క శర్మ, పరిణీతి చోప్రా, అదితిరావు హైదరీ వంటి పేర్లు వినిపిస్తున్నప్పటికీ.. ఫైనల్ డెసిషన్ మాత్రం వెలువడలేదు.

అయితే.. “ఆదిపురుష్”లో మరో ముఖ్యపాత్ర అయినటువంటి లక్ష్మణుడి క్యారెక్టర్ కోసం బాలీవుడ్ నటుడు విక్కీ కౌషల్ ను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. బాలీవుడ్ లో విక్కీ కౌషల్ ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్. ప్రభాస్ పక్కన స్క్రీన్ షేర్ చేసుకోవడానికి విక్కీ అయితే పర్ఫెక్ట్ అనుకున్న డైరెక్టర్ ఓం రౌత్ విక్కీని కలిసాడని, విక్కీ కూడా దాదాపుగా ఒకే చెప్పేసినట్లేనని తెలుస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడు. అక్కడే “ఆది పురుష్, సలార్” షూటింగ్స్ లో పాలుపంచుకుంటూ బిజీ షెడ్యూల్ గడుపుతున్నాడు.

ఇక తదుపరి సినిమా ఎలాగూ హృతిక్ తో అంటున్నారు కాబట్టి మనోడు ఇంకొన్నాళ్ళు అక్కడే సెటిల్ అయిపోవడం ఖాయం. అందుకే అక్కడ ఇల్లు కూడా కొనేశాడట. మరి అక్కడే సెటిల్ అయిపోతాడో ఏమో. ఏదైతేనేమి మన తెలుగు హీరోలు ఎప్పటినుంచో ఊహించుకుంటున్న పాన్ ఇండియన్ ఇమేజ్ ను ప్రభాస్ రెండు సినిమాలతో కైవసం చేసుకోవడం మాత్రం గర్వపడాల్సిన విషయమే!

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus