Manchu Lakshmi: మొదటిసారిగా తండ్రితో కలిసి నటిస్తున్న లక్ష్మీ మంచు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కుటుంబానికి ఎంతో మంచి గుర్తింపు ఉంది. ఇక మోహన్ బాబు ఇండస్ట్రీలో హీరోగా, నిర్మాతగా, విలక్షణ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న ఎంట్రీ ఇచ్చారు.లక్ష్మీ ప్రసన్న అమెరికాలోనే చదువుతూ హాలీవుడ్ సీరియల్స్ లో నటిస్తూ సందడి చేశారు. ఇక తెలుగులో కూడా ఈమె పలు సినిమాలలోనూ టీవీ షో లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ విధంగా మంచు లక్ష్మి నటిగా, వ్యాఖ్యాతగా, నిర్మాతగా కూడా గుర్తింపు పొందారు. ఇకపోతే తాజాగా ఈమె తెలుగులో ఓ సినిమా చేయబోతున్నారు. ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి అగ్ని నక్షత్రం అనే టైటిల్ ఖరారు చేసినట్లు ఈమె వెల్లడించారు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ లక్ష్మీ మంచు ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమాతో ఈమె నిర్మాతగా కూడా మారబోతున్నారు.

అదేవిధంగా తెలుగులో మొదటిసారి తన తండ్రితో కలిసి నటించబోతున్నట్లు ఈమె ఉద్వేగ భరితంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్ని రోజులకు నా కల నెరవేరబోతోంది అంటూ తన తండ్రితో కలిసి నటిస్తున్న విషయాన్ని తెలియజేశారు.తన తండ్రితో కలిసి నటించడమే కాకుండా ఈ సినిమా నిర్మాణంలో తన తండ్రితో భాగ్యస్వామ్యం పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి లక్ష్మి ప్రసన్న తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇకపోతే లక్ష్మీ ప్రసన్న లేచింది మహిళా లోకం అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈమె పలు సినిమాలలో నటించినప్పటికీ సరైన బ్రేక్ రాలేదని చెప్పాలి. ఈ సినిమాలతో అయినా లక్ష్మి సరైన హిట్ తన ఖాతాలో వేసుకుంటారో లేదో వేచి చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus