Lakshmi Pranathi: యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లో ప్రణతికి ఇష్టమైన సినిమా ఇదే!

  • July 15, 2023 / 04:41 PM IST

స్టార్ డైరెక్టర్ రాజమౌళికి తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో నచ్చని సినిమా ఏదనే ప్రశ్నకు స్టూడెంట్ నంబర్1 సినిమా పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఈ సినిమాలో తన మార్క్ ఉండదని రాజమౌళి భావిస్తారు. అయితే లక్ష్మీ ప్రణతికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో ఈ సినిమా అంటే ఎంతో ఇష్టమని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన ఫిదా అయ్యేలా ఉంటుందని ఆమె భావిస్తున్నారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు హీరోగా తొలి సక్సెస్ స్టూడెంట్ నంబర్1 సినిమాతోనే దక్కింది.

స్టూడెంట్ నంబర్1 సినిమాలో గజాలా హీరోయిన్ గా నటించగా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేయడం గమనార్హం. స్టూడెంట్ నంబర్1 సినిమా 2001 సంవత్సరంలో విడుదలై ఆ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే. మరోవైపు దేవర సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

దేవర సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉండనున్నాయని సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ సమయానికి ఈ సినిమా షూట్ పూర్తి కానుంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో మరిన్ని కొత్త పాత్రలు ఉన్నాయని ఆ పాత్రలు సైతం సినిమాకు హైలెట్ అనేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

దేవర సినిమా కమర్షియల్ గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం. దేవర సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద దేవర మూవీ సంచలనాలు సృష్టిస్తుందేమో చూడాలి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఫ్యాన్ బేస్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus