Prabhas: రాధేశ్యామ్.. రియల్ పామిస్ట్ అతనే?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలలో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా కూడా టాప్ లిస్టులో ఉంది అనే చెప్పాలి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించనివిధంగా కలెక్షన్స్ అందుకుంటుంది అని బాక్సాఫీస్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన స్టోరీపై కూడా ఒక టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ పోషిస్తోన్న విక్రమాదిత్య అనే పామిస్ట్రీ పండితుడి పాత్రను.. ప్రముఖ ఐరిష్ హస్త సాముద్రిక నిపుణుడు చీరో నుంచి ప్రేరణగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన అసలు పేరు విలియమ్ జాన్ వార్నర్ కొన్నాళ్ళు ఇండియాలో పామిస్ట్రీ నేర్చుకున్న అతను ఆ తర్వాత లండన్ కి వెళ్లి స్థిరపడ్డారు. ఇక ‘రాధేశ్యామ్’ చిత్రం చివరి 20 నిమిషాల సన్నివేశం లండన్ లోనే చిత్రీకరణ జరిగిందట. ఇదివరకే విడుదలైన ట్రైలర్ లో ప్రభాస్ పామిస్ట్రీ బేస్ తో చెప్పే డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి

దర్శకుడు రాధాకృష్ణ రాధేశ్యామ్ కథనం 15 ఏళ్ల క్రితమే తన గురువు చంద్రశేఖర్ ఏలేటి దగ్గర నుంచి తీసుకున్నాడు. చాలా కాలం పాటు దాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చిన ఈ దర్శకుడు మొత్తానికి ఫైనల్ స్క్రిప్ట్ ను అనేకమంది రచయితలతో చర్చించడం జరిగింది. ప్రభాస్ ఓకే చేసిన తర్వాత ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని యు.వి.క్రియేషన్స్ కూడా భారీ స్థాయిలో బడ్జెట్ను పెట్టుబడిగా పెట్టింది దాదాపు ఈ సినిమా కోసం 300 కోట్ల వరకు ఖర్చు అయినట్లు సమాచారం .

ఇంటర్వెల్ సీన్స్ అలాగే క్లైమాక్స్ లో వచ్చే గ్రాఫిక్ సన్నివేశాలు సినిమాలో అద్భుతంగా ఉంటాయని సమాచారం. ఇక సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమాను మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. మరి రాధేశ్యామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus