కట్టప్పను విలన్ గా ప్రచారం చేసి లీడర్ పోస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!

వారం రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప ఎవరనే సస్పెన్సు కొనసాగింది. మీ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడవాడనికి హౌస్లో ఒక కట్టప్ప వున్నాడని బిగ్ బాస్ తెలియజేయడం ఇంటి సభ్యులను గందరగోళానికి గురిచేసింది. మొదటివారంలోనే ఒకరిని మరొకరు నమ్మని పరిస్థితిని, అభద్రతా భవాన్ని బిగ్ బాస్ ఈ మైండ్ గేమ్ తో క్రియేట్ చేశాడు. ఇంటిలోని సభ్యులు మాత్రం అంతగా కట్టప్పను సీరియస్ గా తీసుకున్న దాఖలాలు లేవు. ఐతే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం యాంకర్ లాస్యను ఎక్కువ మంది కట్టప్పగా భావించారు.

ఇంటి సభ్యులలో ముసుగులో ఉన్న ఆ కట్టప్ప లాస్యనే అని స్టాంప్ వేశారు. ఈ ఉత్కంఠకు నాగార్జున నిన్న తెరదించారు. హౌస్ లో కట్టప్ప ఎవరూ లేరని నాగార్జున తేల్చివేశారు. ఐతే ఎక్కువ మంది లాస్యను కట్టప్పగా భావించిన నేపథ్యంలో నాగార్జున ఆమెను కట్టప్పగా ప్రకటించడంతో పాటు, బిగ్ బాస్ హౌస్ లీడర్ గా ప్రకటించి ఆశ్చర్య పరిచారు. దీనికి లాస్య ఆనందం వ్యక్తం చేయగా, ఇంటి సభ్యులు కంగ్రాట్స్ చెప్పారు. ఇక రానున్న వారం మొత్తం లాస్య లీడర్ ఆఫ్ ది హౌస్ గా ఉంటుంది.

లీడర్ హోదాలో ఆమె వచ్చే వారం ఎలిమినేషన్ నుండి కూడా తప్పుకోనున్నారు. ఇంటి సభ్యులు ఆమెపై చూపిన అనుమానం, నెగెటివిటీ లాస్యకు ప్లస్ అయ్యింది. ఇక మొదటివారానికి మొత్తం ఎదురుగురు ఇంటి సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ కాగా అభిజిత్, గంగవ్వ, జోర్దార్ సుజాత సేవ్ అయ్యారు. సూర్య కిరణ్, దివి, అఖిల్ సార్థక్ మరియు మెహబూబా నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus