Thug Life: కమల్‌ ‘థగ్‌ లైఫ్‌’ చాలా స్పీడ్‌ గురూ.. ఆ ‘3’ రూమర్‌ నిజమేనా?

కమల్‌ హాసన్‌  (Kamal Haasan) చాలా స్పీడ్‌. అందుకే ఆయన సినిమాలు చాలా వేగంగా తెరకెక్కుతాయి అంటుంటారు. అలాంటాయనకు మణిరత్నం (Mani Ratnam) లాంటి దర్శకుడు తోడైతే సినిమా ఇంకా వేగంగా పూర్తవుతుంది. ఇప్పుడు ఈ ఇద్దరూ కలసి చేస్తున్న సినిమా ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) . కొన్నాళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ ఇటీవల ముగిసింది. దాంతో సినిమా 60 శాతం షూటింగ్‌ పూర్తయింది అని చెబుతున్నారు. అవును మీరు చదివింది నిజమే.

‘థగ్‌ లైఫ్‌’ సినిమా అనౌన్స్‌మెంట్‌ అయి చాలా రోజులే అయింది. అయితే ‘భారతీయుడు 2’ (Indian 2)  కోసం మొదలైన షూటింగగ్‌ ‘భారతీయుడు 3’ వరకు సాగడంతో ‘థగ్‌ లైఫ్‌’ ఆలస్యం అవుతూ వచ్చింది. అయితే ‘భారతీయుడు’ సినిమా పనులు పూర్తవ్వడంతో మణిరత్నం సినిమాకే పూర్తి డేట్స్‌ ఇచ్చారు. దీంతో సినిమా షూటింగ్‌ ఏకంగా 60 శాతం అయిపోయిందట. పాండిచ్చేరిలో జరిగిన కీలక షెడ్యూల్‌తో షూటింగ్‌ మేజర్‌ పార్ట్‌ అయింది అని సమాచారం.

మరో 40 రోజుల్లో మిగిలిన సినిమా చిత్రీకరణను పూర్తి చేయడానికి చిత్ర వర్గాలు ప్లాన్స్‌ వేస్తున్నాయట. దీని కోసం త్వరలోనే చెన్నైలో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభిస్తారట. ఆగస్టు ఎండింగ్‌ కల్లా మొత్తం సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలనేది టీమ్‌ టార్గెట్‌ అని తెలుస్తోంది. పీరియాడిక్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో కమల్‌ హాసన్‌ ట్రిపుల్‌ రోల్‌లో కనిపిస్తాడని టాక్‌. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్, మద్రాస్‌ టాకీస్, రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో త్రిష (Trisha) కథానాయిక.

శింబు, అభిరామి (Abhirami) , జోజు జార్జ్ (Joju George) , ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lekshmi)  తదితరులు ఇతర ముఖ్య పాత్రధారులు. ఏఆర్‌ రెహమాన్‌ (A.R.Rahman) సంగీతం అందిస్తుండగా.. రవి.కె.చంద్రన్‌ (Ravi K. Chandran) ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆఖరి షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటారు. ఈ లోపు కమల్‌ నుండి ‘భారతీయుడు 2’ , ‘భారతీయుడు 3’ వస్తాయి. అయితే ఈ సినిమాల తర్వాత కమల్‌ ఏం చేస్తారు అనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus