Pushpa2: ‘పుష్ప2’ కోసం అడవులు వెతుకుతున్న సుకుమార్!

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. దీనికి కొనసాగింపుగా పార్ట్ 2 రాబోతుంది. ‘పుష్ప ది రైజ్’ సృష్టించిన ప్రభంజనానికి పార్ట్ 2పై అంచనాలు పెరిగిపోయాయి. అందుకే దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ ఫైనల్ చేయడానికి చాలా సమయం తీసుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. షూటింగ్ మొదలుపెట్టాల్సిన సమయం దగ్గర పడుతుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో నడిచే సినిమా కాబట్టి కచ్చితంగా అడవుల బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయాలి.

అయితే ఇప్పుడు ఏ అడవిలో సినిమా షూటింగ్ చేయాలనేది ప్రశ్నగా మారింది. మళ్లీ మారేడుమిల్లి వెళ్తారా..? లేక వేరే ఏదైనా లొకేషన్ చూస్తారా..? అనేది క్లారిటీ రావాల్సివుంది. సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో విదేశీ లొకేషన్స్ ను కూడా పరిశీలనలోకి తీసుకుంటున్నారు. ఒక్కసారి అటవీ లొకేషన్స్ ఫైనల్ అయితే షూటింగ్ మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. ఈలోగా షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటే.. హీరో బంగ్లా, ఆ వ్యవహారాలకు సంబంధించిన పార్ట్ ను హైదరాబాద్ లో చిత్రీకరించే అవకాశం ఉంది. 2023 డిసెంబర్ లేదా..

2024 సమ్మర్ కి ‘పుష్ప’ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. చిత్రబృందమైతే 2023లో రిలీజ్ చేయాలనుకుంటుంది. మరి అప్పటికి అన్ని పనులు పూర్తవుతాయో లేదో చూడాలి! ఇక ఈ సినిమాలో దాదాపు పార్ట్ 1లో కనిపించిన పాత్రలే కనిపించనున్నాయి. అడిషినల్ క్యారెక్టర్స్ లేవని అంటున్నారు కానీ.. విలన్ గా ఫహద్ ఫాజిల్ తో పాటు మరో వ్యక్తి కనిపిస్తారని అంటున్నారు.

దర్శకుడు సుకుమార్, బన్నీ, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కి ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకం. అందుకే ఎక్కడా మిస్టేక్ జరగకుండా ఉండాలని ప్రీప్రొడక్షన్ వర్క్ పక్కా ప్లాన్ తో నిర్వహించారు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus