ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తండ్రి ఆరోగ్యంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాలు నేటి ఆరోగ్య పరిస్థితిపై వివరణ ఇచ్చారు. చరణ్ నాన్నగారి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పారు. ఆయనకు ఫిజియో, మరియు ఎక్మో చేస్తున్నారు. అలాగే ఇంకా వెంటిలేటర్ పైనే ఆయన చికిత్స అందిస్తుండగా త్వరలోనే దాని అవసరం లేకుండా ఆయన కోలుకుంటారని భావిస్తున్నాను అన్నారు. బాలుగారి ఆరోగ్యం మెరుగుపడడానికి ఎంజీఎం డాక్టర్స్ బృందం పడ్డ శ్రమకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఆయన కోలుకోవాలని ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికి చరణ్ ధన్యవాదాలు చెప్పారు. 74ఏళ్ల బాలు కరోనా బారిన పడగా, ప్రాధమిక దశలోనే ఎంజిఎం ఆసుపత్రిలో చేరారు. ఐతే ఆసుపత్రిలో చేరిన కొద్దిరోజులలోనే బాలు ఆరోగ్యం విషమంగా మారింది. ఆయన ఊపిరితిత్తులు పై వైరస్ తీవ్ర ప్రభావం చూపించింది. ఈ నేపథ్యంలో ఆయనను ఐసీయూకి తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందించడం జరిగింది. ఒక దశలో బాలు ఆరోగ్యం ప్రమాదస్థాయికి చేరింది.
విదేశీ వైద్యబృందం కూడా బాలు కొరకు రావడం జరిగింది. ఐతే పరిశ్రమలోని ఆయన సన్నిహితులు, కోట్లాది మంది అభిమానులు బాలు తిరిగిరావాలని కోరుకున్నారు. దాదాపు 40రోజులుగా బాలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం బాలుకు కోవిడ్ నెగిటివ్ అని రావడం జరిగింది.