విశాల్ హీరోగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘లాఠీ’. ‘రానా ప్రొడక్షన్స్’ పై రమణ, నంద నిర్మాణంలో రూపొందిన ఈ మూవీకి ఆశించిన స్థాయిలో బజ్ ఏర్పడలేదు. సునైనా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది.డిసెంబర్ 22న ఈ చిత్రం తమిళ్, తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.టాక్ కూడా పాజిటివ్ గా వచ్చింది. కానీ ఓపెనింగ్స్ మాత్రం నిరాశపరిచాయి.
‘అవతార్ 2’ మూవీ ఫుల్ స్వింగ్లో ఉండడం.. పైగా తర్వాతి రోజు ‘ధమాకా’ ’18 పేజెస్’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవ్వడంతో ఈ మూవీ కలెక్షన్స్ దెబ్బతిన్నాయి. ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.24 cr |
సీడెడ్ | 0.13 cr |
ఉత్తరాంధ్ర | 0.15 cr |
ఈస్ట్ | 0.07 cr |
వెస్ట్ | 0.06 cr |
గుంటూరు | 0.09 cr |
కృష్ణా | 0.07 cr |
నెల్లూరు | 0.05 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.86 cr |
‘లాఠీ’ చిత్రానికి రూ.2.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.3.05 కోట్ల షేర్ ని కలెక్ట్ చెయ్యాలి. మూడు రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.0.86 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకో రూ.2.19 కోట్ల షేర్ ను కలెక్ట్ చేయాల్సి ఉంది.
అయితే అది అంత చిన్న విషయం కాదు. ఓ పక్క రవితేజ ‘ధమాకా’ మరో పక్క ’18 పేజెస్’ వంటి క్రేజీ సినిమాలతో పాటు ‘అవతార్ 2’ కూడా ఫుల్ స్వింగ్ లో ఉండడంతో ఈ ‘లాఠీ’ ని జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు అని స్పష్టమవుతుంది.
18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!
ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?