మంచితనానికి మారుపేరు లవకుమార్ | లవ టీజర్ | ఎన్టీఆర్
- August 24, 2017 / 12:14 PM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాబీ దర్శకత్వంలో నటిస్తున్న జై లవకుశ సినిమా రెండో టీజర్ ఈరోజు రిలీజ్ అయింది. హీరో పాత్ర దారి అయిన లవ కుమార్ యొక్క క్యారక్టర్ ని రివీల్ చేశారు. బ్యాంక్ మేనేజర్ అని లవ కుమార్ తనకు తాను పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు లవ కుమార్ కి మంచితనం అనే వీక్ నెస్ ఉందని వివరించారు. “మంచితనం పుస్తకాల్లో ఉంటే పాఠం అవుతుంది. మనలో ఉంటే గుణపాఠం అవుతుంది” అంటూ లవ కుమార్ డైలాగ్ తోనే మంచితనంతోనే చిక్కుల్లో ఇరుక్కోబోతున్నట్లు అర్ధమవుతోంది.
తొలిసారి తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్నఇందులోని నెగటివ్ క్యారక్టర్ అయిన జై కి సంబంధించిన టీజర్ గత నెల విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. అతను చెడ్డోడుగా పేరు తెచ్చుకోగా.. నేడు రిలీజ్ అయిన టీజర్ తో లవ కుమార్ మంచోడిగా స్పష్టమయింది. రెండు క్యారెక్టర్లో పూర్తి విభిన్నత చూపించి ముందుగానే బాబీ క్యారెక్టర్స్ పై క్లారిటీ ఇచ్చారు. ఇక మూడో క్యారక్టర్ కుశ ఎలా ఉండబోతుందోనని ఆసక్తి పెరిగింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 న థియేటర్లలో రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















