‘లవకుశ’ సినిమా నటుడు నాగరాజు ఇక లేరు!

మహా నటుడు యన్టీర్, అంజలి దేవి నటించిన లవకుశ చిత్రం చూడని తెలుగువారు వుండరు. ఆ చిత్రంలో లవకుశులుగా అలరించిన బాల నటులుగా సుబ్రహ్మణ్యం, నాగరాజులు నటించారు. లవకుశ’ సీత రాములను కళ్లకు కట్టినట్టు చూపించే ఈ సినిమా ఇప్పటికీ చెక్కుచెదరిని ఒక అపురూప చిత్రం. అందులో లవ, కుశలుగా నటించిన ఇద్దరు పిల్లలు సినిమాకే హైలెట్‌గా నిలిచారు. వారి హావ భావాలు ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేశారు. ఆ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఆ ఇద్దరు పిల్లలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంటారు.

వారు పెరిగి పెద్దవారయినప్పటకీ లవ, కుశలుగానే అందరి చేత గుర్తింపు పొందారు.  లవకుశ సినిమాలో లవుడుగా తన ముద్దు ముద్దు మాటలతో అందరిని అలరించిన బాలుడి పెరుగు నాగరాజు. అమ్మమీద అమితమైన ప్రేమ, తండ్రినే ఎదిరించే సాహసం రెండు కలగలిపిన పాత్ర లవడుది. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఆ సినిమాలో రాముడి పాత్ర పోషించగా ఆయననే ఎదిరించి యుద్దం చేస్తారు మన లవకుశలు. ఆ సినిమా ద్వారా ఎందరినో ఆకట్టుకున్న నాగరాజు సోమవారం కన్నుమూశారు. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గాంధీనగర్‌లోని తన నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

నాగరాజు మరణం పట్ల సినిమా పరిశ్రమకు చెందిన వారు, ‘లవకుశ’ అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు.ఇప్పటివరకు తెలుగు తమిళం భాషల్లో  340కు పైగా చిత్రాల్లో నటించారు.  యన్టీర్ పౌరాణిక చిత్రాల్లో  షుమారు 22 చిత్రాల్లో వివిధ పౌరాణిక పాత్రల్లో  నటించారు.ఈ సందర్భంగా తెలుగు టి వి రచయితల సంఘం అధ్యక్షులు డి సురేష్ కుమార్, మరియు సంఘ సభ్యులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, అయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తూ తమ సంతాపాన్ని తెలియచేసారు.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus