Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

‘హనుమాన్’ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న తేజ సజ్జ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం ‘మిరాయ్’. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. ఈ ఏడాది ఏప్రిల్ 18న విడుదల కావాల్సిన సినిమా ఇది. కానీ షూటింగ్ డిలే అవుతూ ఉండటం వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తుంది. ఏప్రిల్ 18 తర్వాత ఆగస్టు 1 రిలీజ్ అన్నారు. అటు తర్వాత సెప్టెంబర్ 5కి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Mirai

ఇప్పుడు ఆ డేట్ కి కూడా సినిమా రావడం కష్టమే అంటున్నారు. ఎందుకంటే సీజీ వర్క్ కి సంబంధించిన అప్డేట్ సంతృప్తి కరంగా రాలేదట. దీంతో మళ్ళీ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ‘ఈగిల్’తో మెప్పించిన కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకుడు. ‘మిరాయ్’ గ్లింప్స్, టీజర్ వంటివి పర్వాలేదు అనిపించాయి. ముఖ్యంగా వాటిలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ బాగా అనిపించింది. మంచు మనోజ్ కూడా ఈ సినిమాలో విలన్ గా నటించడం అనేది మరో కొసమెరుపు.


ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ‘మిరాయ్’ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 5న అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ‘మిరాయ్’ వారం రోజులు వెనక్కి వెళ్లనుందట. అంటే సెప్టెంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కానుంది అని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందట. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.

లవబుల్‌ పిక్‌ షేర్‌ చేసిన మోహన్ లాల్‌.. ఆనందంలో స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus