Lavanya Tripathi: పెళ్లి తర్వాత ఇంటి పేరును మార్చుకున్న లావణ్య.. సంతోషంలో ఫాన్స్?

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి లావణ్య త్రిపాఠి. తన మొదటి సినిమాతోనే నటన ద్వారా పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ వచ్చారు. ఇలా హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి లావణ్య త్రిపాఠి మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో కలిసి మిస్టర్ అంతరిక్షం అంటే సినిమాలలో నటించారు.

ఈ సినిమాల (Lavanya Tripathi) సమయంలోనే ఈమెతో ప్రేమలో పడ్డారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి లావణ్య వరుణ్ వీరి ప్రేమ విషయాన్ని తమ పెద్దలకు తెలియజేసి ఎంతో ఘనంగా వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా తాను ప్రేమించినటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని మెగా ఇంటికి కోడలుగా లావణ్య త్రిపాఠి అడుగుపెట్టారు. అయితే వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె తన ఇంటి పేరును కూడా మార్చుకున్నారని తెలుస్తుంది.

ఇప్పటివరకు సోషల్ మీడియా ఖాతాలలో లావణ్య త్రిపాఠి అని ఉన్నటువంటి ఈమె పేరు పక్కన కొణిదెల పేరును చేర్చుకున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఈమె తన పేరు పక్కన కొణిదెల పేరును జత చేసి లావణ్య త్రిపాఠి కొణిదెల మారిపోయారు. ఈమె కేవలం ఇంస్టాగ్రామ్ పేజ్ లో మాత్రమే తన పేరును మార్చుకున్నారు కానీ మిగిలిన ఫేస్ బుక్ ట్విట్టర్లో లావణ్య త్రిపాఠి అని మాత్రమే ఉంది.

ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత తన ఇంటిపేరును మార్చుకోవడంతో మెగా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈమె ఇంస్టాగ్రామ్ పేజ్ వైరల్ చేస్తున్నారు. ఇక ఉపాసన కామినేనిగా ఉన్నటువంటి ఈమె మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టిన తర్వాత ఉపాసన కొణిదెలగా తన పేరును మార్చుకున్నారు.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus