Lavanya Tripathi: ఇకనుంచి అవి నావేనంటున్న లావణ్య.. ఆనందానికి అవధులు లేవుగా!

మెగా కోడలు లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటున్న లావణ్య త్రిపాఠి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాల్యం నుంచి అమ్మ చెవిదిద్దులు అంటే ఇష్టమని ఆమె తెలిపారు. ఇకపై అమ్మ చెవిదిద్దులు నావేనని లావణ్య పేర్కొన్నారు. అమ్మ చెవిదిద్దులు పెట్టుకున్న ఫోటోను పంచుకుంటూ లావణ్య ఈ కామెంట్లు చేశారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా లావణ్య షేర్ చేసిన ఈ పోస్ట్ కు లక్షా 35 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

లావణ్య త్రిపాఠి కొనుగోలు చేయాలంటే లక్షల, కోట్ల రూపాయల విలువైన చెవిదిద్దులను కొనుగోలు చేయగలరని అయినప్పటికీ ఆమె మాత్రం తల్లి చెవిదిద్దులను పెట్టుకుని ఆ సంతోషాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారంటే ఆమె ఎంతో గ్రేట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లావణ్య ఆనందానికి అవధులు లేవంటూ మరి కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు. వరుణ్ తేజ్ (Varun Tej) , లావణ్య త్రిపాఠి ఇప్పుడు సినిమాలలో కలిసి నటిస్తే చూడాలని ఉందని మరి కొందరు ఫ్యాన్స్ చెబుతుండగా వరుణ్, లావణ్య తలచుకుంటే ఈ కాంబోలో సినిమా రావడం కష్టమేం కాదు.

ఎఫ్3 తర్వాత ఆ రేంజ్ హిట్ లేని వరుణ్ తేజ్ ఫిదా, తొలిప్రేమ, ఎఫ్2 తరహా కథాంశాలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కెరీర్ ప్లానింగ్ కు సంబంధించి పూర్తిస్థాయిలో స్పష్టత రావాల్సి ఉంది. లావణ్యకు ఇన్ స్టాగ్రామ్ లో 3.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

తన సినీ కెరీర్ లో అభినయ ప్రధాన పాత్రల్లోనే నటించిన లావణ్య త్రిపాఠి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. లావణ్య త్రిపాఠి రాబోయే రోజుల్లో బిజినెస్ లేదా సినిమా రంగంలోనే ఇతర క్రాఫ్ట్స్ పై దృష్టి పెట్టే అవకాశాలు సైతం ఉన్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus