తెలుగమ్మాయి కాకపోయినా తెలుగమ్మాయిలా కనిపించే నటీమణులలో లావణ్య త్రిపాఠి ఒకరు. కెరీర్ మొదట్లో పక్కింటి అమ్మాయి, కాలేజ్ స్టూడెంట్ తరహా పాత్రల్లో నటించిన లావణ్య త్రిపాఠి ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా సినిమాల్లో నటించిన లావణ్య త్రిపాఠి ఈ రెండు సినిమాలు మార్చి నెలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాలపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగేలా చేసుకుంటున్నారు. మార్చి 5వ తేదీన ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ విడుదల కానుండగా విలేకర్లతో ముచ్చటించిన లావణ్య తాను కొత్తగా ఏదైనా చేయాలని అనుకుంటున్న తరుణంలో ఏ1 ఎక్స్ ప్రెస్ కథ విన్నానని..
కథ ఎంతగానో నచ్చిందని అన్నారు. సందీప్ కిషన్ ఒక సందర్భంలో ముంబైలో తనను కలిసి షార్ట్ గా ఏ1 ఎక్స్ ప్రెస్ స్టోరీ చెప్పాడని.. రీమేక్ మూవీ అయిన ఈ మూవీ కథలో దాదాపు 50 శాతం మార్పులు చేసినట్టు వెల్లడించారు. గ్లామర్ పాత్రలు చేసి బోర్ కొట్టడంతో ఈ సినిమాలో హాకీ ప్లేయర్ పాత్రలో కనిపించబోతున్నానని లావణ్య త్రిపాఠి అన్నారు. ఆటల వెనుక ఉన్న రాజకీయ కోణాల గురించి ఈ సినిమాలో చర్చిస్తున్నామని..
లవ్ స్టోరీ అయినప్పటికీ సినిమాలో కమర్షియల్ హంగులు పుష్కలంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు. చిన్నప్పుడు హాకీ ఆడకపోయినా ఈ మూవీ కోసం నేర్చుకోవాల్సి వచ్చిందని లావణ్య అన్నారు.