Lavanya Tripathi: మెగా కోడలిగా లావణ్య మొదటి దీపావళి.. ఫోటోలు వైరల్!

దీపావళి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలు కూడా దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన దీపావళి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం జరిగిన తర్వాత వచ్చిన మొదటి దీపావళి కావడంతో ఈ దీపావళి వేడుకను లావణ్య త్రిపాఠి తన అత్తగారి ఇంట్లోనే జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ షేర్ చేసిన ఫోటోలు కనుక చూస్తే నాగబాబు దంపతులతో పాటు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిహారిక కూడా పెద్ద ఎత్తున క్రాకర్స్ కాలుస్తూ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారని తెలుస్తుంది. ఇలా ఇంటి ముందు క్రాకర్స్ కాలుస్తూ ఉన్నటువంటి ఫోటోలను వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అలాగే ఇంట్లో కూడా అందంగా ముగ్గులను వేసి అక్కడ కుటుంబ సభ్యులందరూ కలిసి దిగినటువంటి ఫోటోలను వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు హ్యాపీ దీపావళి అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి జరిగిన తర్వాత మొదటి దీపావళి పండుగ రావడంతో ఈ దీపావళి పండుగను (Lavanya Tripathi) లావణ్య త్రిపాఠితన అత్తగారి కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడం విశేషం.

ఇక వీరి వివాహం నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన రిసెప్షన్ మాత్రం హైదరాబాద్లో ఎంతో ఘనంగా టాలీవుడ్ సెలబ్రిటీల సమక్షంలో జరిగింది.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus