Lavanya Tripathi: వైరల్ అవుతున్న లావణ్య త్రిపాఠి పోస్ట్!

అందాల రాక్షసిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. తన తొలి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో కుర్రాళ్ల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఫస్ట్ సినిమా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇదే సమయంలో తనకు ఇతర భాషలలో అవకాశాలు వచ్చాయి. కానీ అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో పలు వెబ్ సిరీసుల్లో నటిస్తూ బిజీగా ఉంది. పరాయి భాషకు చెందిన హీరోయిన్ అయినా తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ పక్కింటి అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

ఇలా హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక అభిమానులకు సంపాదించుకున్న (Lavanya Tripathi) లావణ్య మెగా హీరో వరుణ్ తేజ్ తో దాదాపుగా ఐదేళ్ల పాటు ప్రేమాయణం నడిపింది. వారి ప్రేమకు పెద్దలు ఒప్పుకుని త్వరలోనే ఆ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవల వీరి నిశ్చితార్థం చాలా వైభవంగా జరిగింది. లావణ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తన అభిమానులతో పంచుకుంటుంది.

ఇక పోతే సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై గాసిప్ రావడం కామన్ అయిపోయింది. ప్రస్తుతం లావణ్య అలాంటి గాసిప్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు ఇటీవల ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ జంట త్వరలోనే పెళ్లితో ఒక్కటవబోతుంది. సెలబ్రిటీల గురించి వస్తున్నటువంటి ఈ వార్తల పైన స్పందించిన లావణ్య..

గాసిప్ క్రియేట్ చేసే వాళ్లు తమ సమయాన్ని మీకోసం ఉపయోగించుకోండంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఒక మనిషిని చూసి మూడు నిమిషాల లోపే జడ్జిమెంట్ ఇవ్వడం మానేయ్యాలని సూచించింది..మనం ఒకరి గురించి నెగటివ్ గా మాట్లాడుతున్నామంటే మన జీవితం కూడా అలాగే ఉంటుంది అని ఇన్ స్టాలో ఓ పోస్ట్ చేసింది ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus