Lavanya Tripathi: యంగ్ హీరో మూవీకి లావణ్య ఓకే చెప్పారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోయిన్ గా గుర్తింపును సొంతం చేసుకున్న లావణ్య త్రిపాఠి సినీ కెరీర్ లో హిట్లు ఏ స్థాయిలో ఉన్నాయో ఫ్లాపులు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఒకవైపు యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూనే మరోవైపు సీనియర్ హీరోలకు సైతం లావణ్య త్రిపాఠి జోడీగా నటించారు. కెరీర్ లో ఎక్కువగా మిడిల్ రేంజ్ హీరోలకు జోడీగా లావణ్య త్రిపాఠి నటించారు. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ హీరోలు లావణ్యకు పెద్దగా ఆఫర్లు ఇవ్వలేదు.

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీలో లావణ్య సెకండ్ హీరోయిన్ అని వార్తలు వచ్చినా ఆ వార్తలు నిజం కాదని తేలిపోయింది. చావు కబురు చల్లగా ఫ్లాప్ తర్వాత లావణ్యకు అవకాశాలు తగ్గాయి. అయితే ఈ హీరోయిన్ తాజాగా ఒక యంగ్ హీరోకు జోడీగా నటించడానికి లావణ్య త్రిపాఠి ఓకే చెప్పారు. మత్తు వదలరా సినిమాలో హీరో ఫ్రెండ్ రోల్ లో నటించిన నరేష్ అగస్త్య లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న సినిమాలో లావణ్య నటించనున్నారు.

రితేష్ రాణా డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. మత్తు వదలరా దర్శకుడు రితేష్ రాణా రెండో సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని లావణ్య నమ్ముతున్నారు. కెరీర్ విషయంలో లావణ్య ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus